New Year Celebration:2025 సంవత్సరం డిసెంబర్ 31న అర్ధరాత్రి గత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ, నూతన సంవత్సరమైన 2026ను ఆహ్వానిస్తూ జరుపుకునే వేడుకలకు మీరు సిద్ధమవుతున్నారా? హోటళ్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లకు వెళ్తున్నారా? ఈవెంట్స్ నిర్వహిస్తున్నారా? బహిరంగ వేడుకలకు ప్లాన్ చేశారా? మీరు ఈ విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. హైదరాబాద్ మహానగరం పరిధిలో జరిగే వేడుకలపై నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ కఠిన నబంధనలను జారీ చేశారు. వీటిని పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ నియమ, నిబంధనలు కింది విధంగా ఉన్నాయి.
New Year Celebration:డిసెంబర్ 31న అర్ధరాత్రి తర్వాత ఈవెంట్లు నిర్వహించాలంటే ముందస్తు పోలీసుల అనుమతి తప్పనిసరి. ఈ మేరకు వేడుకల నిర్వహణపై 15 రోజులకు ముందే అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ నిబంధనల ప్రకారం.. నిర్వహణ స్థలాల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో కచ్చితంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. ట్రాఫిక్ నియంత్రణకు తగినంత భద్రతా సిబ్బందిని నిర్వాహకులు నియమించుకోవాలి.
New Year Celebration:సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. బహిరంగ ప్రదేశాల్లో డీజే బాక్సులు, ఇతర లౌడ్ స్పీకర్లు, సౌండ్ యాంప్లిఫయర్లు రాత్రి 10 గంటలకే నిలిపివేయాల్సి ఉంటుంది. అనుమతి పొంది ఉంటే ఇండోర్ రెస్టారెంట్లు, బార్లలో మాత్రం రాత్రి ఒంటిగంట వరకు సంగీతం వినేందుకు వెసులుబాటు ఉంటుంది. అయితే వాటిల్లో 45 డెసిబెల్స్ ధ్వని తీవ్రత మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అంతకు ఎక్కువగా ఉంటే చర్యలు తప్పవు.
New Year Celebration:వేషధారణలో మర్యద తప్పనిసరి అని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీచేశారు. నగ్న ప్రదర్శనలు, అశ్లీల నృత్యాల ప్రదర్శనతో పాటు డ్రగ్స్, మత్తు పదార్థాల పంపిణీపై పూర్తి నిషేధం విధించారు. ఈవెంట్స్ నిర్వాహకులు టికెట్ల విక్రయాలపైనా ఆంక్షలు విధించారు. పరిమితికి మించిన టికెట్ల విక్రయాలు వద్దని ఆదేశించారు. జనసందోహం వల్ల శాంతిభద్రతలు తలెత్తే ప్రమాదం ఉన్నదని, ఇతర ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
New Year Celebration:బార్లలో జంటల కోసం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలకు మైనర్లను అనుమతించొద్దని ఆదేశించారు. మద్యం సేవించిన వారికి సురక్షిత ప్రయాణ బాధ్యత నిర్వాహకులదేనని పేర్కొన్నారు. మద్యం సేవించిన కస్టర్లను క్యాబ్, డ్రైవర్ సౌకర్యం కల్పించే బాధ్యత నిర్వహణ సంస్థలు చూసుకోవాలని, వారు ఇంటికి సురక్షితంగా చేరేలా చూడాలని పేర్కొన్నారు. పటాసుల వినియోగంపై పూర్తిగా నిషేధం ఉన్నదని సీపీ సజ్జనార్ తెలిపారు.
