Telangana: కుమ్రం భీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గురువారం విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సుమారు 30 మంది అస్వస్థత భారిన పడ్డారు. కడుపునొప్పి, విరేచనాలతో బాధపడుతున్న విద్యార్థినులను వెంటనే మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స అందజేస్తున్నారు. ఆసుపత్రిలో బెడ్లు సరిగా లేకపోవడంతో ఒక్కోదానిపై ఇద్దరికి చొప్పున ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. విద్యార్థినుల అస్వస్థతకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.