Spurious Liquor

Spurious Liquor: తీవ్ర విషాదం.. క‌ల్తీ మ‌ద్యం సేవించి 15 మంది మృతి.. ఆరు మందికి తీవ్ర అస్వ‌స్థ‌త‌

Spurious Liquor: పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించిన 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మజితా ప్రాంతంలోని పలు గ్రామాలకు చెందిన వారు నకిలీ మద్యం తాగి అస్వస్థతకు గురయ్యారు. మరో ఆరుగురు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ముప్పు తప్పినట్లుగా లేదని సమాచారం.

ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. భంగాలి, మరారి కలన్‌, తరివాల్ గ్రామాలకు చెందిన పలువురు యువకులు మద్యం సేవించిన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారు. ఒక్క మద్యం షాపు నుంచే ఈ మద్యం కొనుగోలు చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.

అమృత్‌సర్ ఎస్‌ఎస్‌పీ మనీందర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, “సోమవారం రాత్రి మాకు సమాచారం అందింది. వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించాం. ఇప్పటివరకు 15 మంది మృతి చెందారు,” అని తెలిపారు.

ఇది కూడా చదవండి: Road Accident in US: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి

అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ సాక్షి సాహ్ని మాట్లాడుతూ, “ఘటనపై వెంటనే స్పందించాం. వైద్య బృందాలను ఐదు గ్రామాలకు పంపించాం. బాధితుల రక్తపరీక్షలు జరుగుతున్నాయి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయం అందిస్తోంది. మరణాల సంఖ్య పెరగకుండా చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు.

ఇక ఘటనపై పోలీసులు సత్వర చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడు ప్రబ్‌జిత్ సింగ్‌ను అరెస్టు చేశారు. అలాగే ఈ కల్తీ మద్యం సరఫరాలో ఉన్న మరో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో కింగ్‌పిన్‌గా ఉన్న సాహిబ్ సింగ్ అనే వ్యక్తిని రాజసాని ప్రాంతంలో పట్టుకున్నారు. లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌కు చెందిన మరో నలుగురినీ పోలీసులు అరెస్టు చేశారు.

కల్తీ మద్యం ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో తెలుసుకునేందుకు పోలీసులు మజితా పరిధిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లోనూ దాడులు జరుపుతున్నారు. మరికొంతమందిని రహస్యంగా దహనం చేసిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ALSO READ  Gujarat: మ్యాన్ హోల్ లో పడిపోయిన చిన్నారి.. కొనసాగుతున్న రెస్క్యు ఆపరేషన్

ఈ ఘటన పంజాబ్‌ను ఒక్కసారి కుదిపేసింది. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడే నకిలీ మద్యం ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

WordsCharactersReading time
WordsCharactersReading time

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *