Electricity Charges: రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు భారం పెరిగింది. గత వైసీపీ హాయాంలో అధిక ధరలకు విద్యుత్‌ను కొనుగోలు చేసింది. వాటిల్ని ఇప్పుడు వసూలు చేసుకునేందుకు సిద్దమైయ్యాయి. విద్యుత్ సంస్థలు… దీనికి ఇప్పటికే ఈఆర్‌సి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు పెరిగాయి. దీంతో ప్రజల్లో కూడా ప్రభుత్వంపై అసంతృప్తి ప్రారంభమైంది. అయితే… దీనిని అదునుగా భావించిన వైసీపీ విద్యుత్ బిల్లుల పెంపుపై కూటమి ప్రభుత్వంపై పోరుబాట ప్రారంభించింది. గత కొద్ది రోజులుగా విమర్శలు చేస్తున్న వైసీపీ… నిన్న రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బిల్లులు పెంపుపై రోడ్డుపై బైఠాయింపులు, రాస్తారోకోలు, ర్యాలీలు వంటి ఆందోళనలు నిర్వహించింది. ప్రస్తుతం బిల్లులు పెరగడానికి కారణమైన వైసీపీ ఆందోళన బాట పట్టడంపై అధికార పక్షం విమర్శలకు దిగింది.
గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ బిల్లులు పెంపు ఆందోళనపై కూటమి ప్రభుత్వం తీవ్ర విమర్శలకు దిగింది. వైసీపీ తీరు దోంగే దోంగ అన్నట్లు ఉందని పలువురు మంత్రులు మండిపడ్డారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ హాయాంలో చేసున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసింది. దీంతో విద్యుత్‌ను బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. దీని వలన ఎండకాలం పీక్ టైమ్‌లో విద్యుత్ ఒక్క యూనిట్ 20 రుపాయిలకు కూడా కొనుగోలు చేసింది అప్పటి ప్రభుత్వం… ఇలా అప్పుడు ఎక్కువ ధరలకు కొనుగోలు చేసిన విద్యుత్ భారంను..విద్యుత్ సంస్థలు ఇప్పుడు ఆ భారం ప్రజలపై మోపాయి. దీంతో విద్యుత్ బిల్లులు కూడా పెరిగాయి.
Electricity Charges: అయితే వైసీపీకి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు అధికార పక్షం సిద్దమైంది. మాజీ సీఎం జగన్ ఐదేళ్ల పాలనలో ఆయన అవినీతి, అసమర్దత వలన విద్యుత్ భారాలు దాదాపు లక్షా 29 వేల కోట్లు రుపాయిలని కూటమి నేతలు విమర్శలకు దిగారు. గత వైసీపీ హయాంలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి 32 వేల 165 కోట్ల భారం మోపింది. ఇదే క్రమంలో విద్యుత్ సంస్థలపై 49 వేల 596 కోట్లు అప్పులు భారం పెరిగింది.
వీటీపీఎస్, కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు జాప్యం వలన, పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రజెక్‌లో జాప్యం, స్వల్ప కాలిక విద్యుత్ కొనుగోళ్లు నష్టం, సెకితో చేసుకున్న ఒప్పందం వలన, అప్పులపై వడ్డీ భారం, ఏపీ డిస్కం ఎపిసిపిడిసిఎల్ నిర్వహణ వైఫల్యం జెన్కో ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం వంటి అంశాలలో 47 వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇన్ని అంశాలలో రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు ప్రజలపై అదనపు బిల్లులకు కారణమైన వైసీపీ రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయడం ఆశ్చర్యంగా ఉంది. వైసీపీ తప్పిదాలను ప్రభుత్వం ఎండగట్టడంలో అనుకున్నంతగా లేదన్న వాదన వినిపిస్తోంది.
రాసినవారు: వి. శ్రీనివాస్…
అమరావతి
సీనియర్ కరస్పాండెంట్