YSRCP Leaders: పొదిలిలో జరిగిన రాజకీయ ఉద్రిక్తతలపై పోలీసులు గట్టిగా స్పందిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ క్రమంలో, “ఎవడైనా తొక్కిపడేస్తాం” అంటూ ఫ్లెక్సీల్లో నినాదాలు చేసిన యువ వైసీపీ నాయకులు సంగటి ఇసాక్, వేసిపోగు రాజేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ వెలిగండ్ల మండలం బొంతల గుంట్ల గ్రామానికి చెందినవారుగా గుర్తించారు.
పొదిలి పోలీసులు వీరిపై ఇప్పటికే విచారణ ప్రారంభించగా, ఈ ఘర్షణలకు ఎవరు కారణమయ్యారో తెలుసుకునే దిశగా విచారణ వేగంగా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..
“జగన్ పర్యటనలో ఎవరు గాంధీ మార్గానికి విరుద్ధంగా, శాంతి భంగానికి పాల్పడ్డారో వారిని వదిలిపెట్టే ప్రశక్తే లేదు. చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు.
ప్రస్తుతం పోలీసు యంత్రాంగం బాధ్యతగా వ్యవహరిస్తూ, మిగతా సంబంధిత వ్యక్తుల గుర్తింపుపై దృష్టిసారించింది.

