Actor Sriram: తెలుగు, తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు పొందిన నటుడు శ్రీరామ్ ప్రస్తుతం డ్రగ్స్ కేసుతో వార్తల్లో నిలిచారు. ‘రోజాపూలు’, ‘ఒకరికి ఒకరు’, ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’ వంటి హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీరామ్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ కొనుగోలు ఆరోపణలు
చెన్నై నగరంలోని నుంగంబాక్కం పోలీసులకు అందిన సమాచారం ప్రకారం, తమిళనాడుకు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి ద్వారా శ్రీరామ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. దీనిపై విచారణ మొదలుపెట్టి, రక్తపరీక్షలో డ్రగ్స్ వాడిన ఆధారాలు లభించటంతో ఆయనను అరెస్ట్ చేశారు.
ఎగ్మోర్ కోర్టులో హాజరు – రిమాండ్
శ్రీరామ్‌ను పోలీసులు ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి జూలై 7 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. పోలీసులు మరింత విచారణకు ఆయనను కస్టడీలోకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, శ్రీరామ్ కూడా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: NTR-Neel: ఎన్టీఆర్, నీల్ మూవీలో అదిరిపోయే యాక్షన్ బ్లాక్?
శ్రీరామ్ స్పందన – “తప్పు చేశాను, కానీ నన్ను మాఫ్ చేయండి”
న్యాయస్థానానికి సమర్పించిన తన పిటిషన్‌లో శ్రీరామ్,
“నేను ఒక పెద్ద తప్పు చేశాను. కానీ డ్రగ్స్‌ను ఎవరికి అమ్మలేదు, ఎవరికీ ప్రోత్సహించలేదు. తాను మాత్రమే తీసుకున్నాను. విదేశాలకు పారిపోను. సాక్షులను ప్రభావితం చేయను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను,”
అని స్పష్టం చేశారు. తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరారు.
కేసులో పోలీసుల దర్యాప్తు
ఈ కేసు నుంగంబాక్కం బార్‌లో జరిగిన ఓ ఘర్షణ నుండి వెలుగులోకి వచ్చింది. ఈ ఘర్షణలో పాల్గొన్న ప్రసాద్, అజయ్ వాండైయార్ వంటి వ్యక్తులపై విచారణ జరుగుతున్నప్పుడు డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. వారి సమాచారం మేరకు ప్రదీప్‌కుమార్ అనే డ్రగ్స్ డీలర్‌ను పట్టుకుని, అతని ద్వారా శ్రీరామ్‌కు డ్రగ్స్ సరఫరా అయినట్టు నిర్ధారించారు.
గత సినిమాలు, గుర్తింపు
శ్రీరామ్ ‘రోజాపూలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తర్వాత ‘కందిరీగ’, ‘మస్కా’, ‘భలే మంచి రోజు’, ‘హరికథ’ వెబ్ సిరీస్ వంటి చిత్రాల్లో కూడా నటించారు.

