Ramayana

Ramayana: ‘రామాయణం’ సినిమాలో యాక్షన్ హంగామా.. యష్ కోసం హాలీవుడ్ టెక్నీషియన్!

Ramayana: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నితీష్ తివారి రూపొందిస్తున్న భారీ చిత్రం ‘రామాయణం’ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రాముడిగా రణబీర్, సీతగా సాయి పల్లవి నటిస్తుండగా, రావణాసురుడి పాత్రలో కన్నడ స్టార్ యష్ కనిపించనున్నారు. యష్ కేవలం నటుడిగానే కాక, నిర్మాతగా కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి హాట్ అప్డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం సినిమాలో కీలక యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జోరుగా సాగుతోందట. హాలీవుడ్ స్టంట్ దిగ్గజం గయ్ నోరిస్, ‘మ్యాడ్ మాక్స్’ వంటి సినిమాలకు పనిచేసిన అనుభవంతో, ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్‌ను తీర్చిదిద్దుతున్నారు. సెట్స్ నుంచి యష్‌తో గయ్ నోరిస్ యాక్షన్ సన్నివేశాలపై చర్చిస్తున్న ఓ చిత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటో చూస్తేనే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ స్థాయిలో ఉంటాయో ఊహించవచ్చు. ఈ భారీ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతోంది!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Samantha: టాప్ టెన్ లో మళ్లీ సమంత నే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *