Women’s T20 World Cup: మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా శుక్రవారం, అక్టోబర్ 4న భారత మహిళల జట్టు తన తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. T-20 ఫార్మాట్‌లో న్యూజిలాండ్ మహిళల జట్టు భారత్‌పై పైచేయి సాధించినా, ప్రపంచకప్‌లో మాత్రం ఇద్దరి మధ్య సమ పోటీ నెలకొంది. గత ప్రపంచ కప్ టోర్నమెట్స్ లో ఈ రెండు టీములు తపడిన 4 మ్యాచ్‌ల్లో 2-2 మ్యాచ్‌లు గెలుచుకున్నాయి.
Women’s T20 World Cup: ఈ 4 మ్యాచ్‌ల్లో మొదటి 2 మ్యాచ్‌ల్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. 2009 సెమీ-ఫైనల్‌అలాగే 2010లో న్యూజీలాండ్ గెలిచింది. ఇక 2018, 2020 లో భారత్ గెలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్ ఇది 9వ ఎడిషన్. భారత మహిళల జట్టు తొలి టైటిల్ కోసం ఎదురుచూస్తోంది. భారత జట్టు గ్రూప్-ఎలో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్-న్యూజిలాండ్ తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి.
తొలి మ్యాచ్ వివరాలు…
ఇండియా Vs న్యూజిలాండ్
అక్టోబర్ 4, దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, దుబాయ్
టాస్- 7 PM; మ్యాచ్ ప్రారంభం- 7:30 PM
భారత్‌పై న్యూజిలాండ్ ఆధిపత్యం..
Women’s T20 World Cup: టీ-20 క్రికెట్‌లో న్యూజిలాండ్ మహిళల జట్టు భారత్‌పై ఆధిపత్యం ప్రదర్శించింది. 2009 నుంచి ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య 13 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో న్యూజిలాండ్ 9 మ్యాచ్‌లు గెలవగా, భారత్ 4 మ్యాచ్‌లు గెలిచింది.
వీరిద్దరి మధ్య చివరి టీ20 మ్యాచ్ 2022 ఫిబ్రవరిలో జరిగింది. భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లినప్పుడు. ఈ ఒక్క మ్యాచ్‌లో న్యూజిలాండ్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Women’s T20 World Cup: ప్రస్తుత భారత స్టార్ బ్యాట్స్‌మెన్ స్మృతి మంధాన అద్భుతమైన ఫామ్‌లో ఉంది . మంధాన 495 పరుగులతో ఈ ఏడాది టి-20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్. బౌలింగ్‌లో దీప్తి శర్మ అగ్రస్థానంలో ఉంది.
న్యూజిలాండ్ జట్టులో సుజీ బేట్స్ రూపంలో ఒక అనుభవజ్ఞుడైన ప్లేయర్ ఉంది. బేట్స్ T-20 ప్రపంచ కప్, ఇంటర్నేషనల్‌లో టాప్ స్కోరర్ . బేట్స్ T20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (1066) చేసిన బ్యాటర్ మాత్రమే కాదు, మహిళల T20 అంతర్జాతీయ చరిత్రలో అత్యధిక పరుగులు (4434) చేసిన ప్లేయర్ కూడా. ఇదొక్కటే కాదు, ఈ ఏడాది న్యూజిలాండ్ టాప్ స్కోరర్ (316 పరుగులు) బేట్స్. అలాగే, ఈ టీంలో అమీలియా కెర్ అత్యధికంగా 14 వికెట్లు పడగొట్టింది.
ముఖ్యమైన మ్యాచ్..
ఈ మ్యాచ్ రెండు జట్లకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ గ్రూప్ నుండి టాప్ 2 జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. అటువంటి పరిస్థితిలో రెండు జట్లూ మ్యాచ్‌ను గెలవడం ద్వారా తమ స్థితిని పటిష్టం చేసుకోవాలనుకుంటున్నాయి.
పిచ్ రిపోర్ట్ – రికార్డ్స్
Women’s T20 World Cup: మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైనది. ఫాస్ట్ బౌలర్లు కూడా ప్రారంభంలో సహాయం పొందవచ్చు. టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయం సరైనదని నిరూపించవచ్చు. ఈ వికెట్‌పై ఛేజింగ్ ఎంపిక సరైనదిగా ఇప్పటివరకూ ఉన్న రికార్డ్స్ చెబుతున్నాయి. ఈ స్టేడియంలో ఇప్పటి వరకు 5 మహిళల టీ-20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 2 మ్యాచ్‌లు, ఛేజింగ్‌లో 3 మ్యాచ్‌లు గెలుపొందాయి.
వాతావరణ పరిస్థితులు:
మ్యాచ్ రోజు దుబాయ్‌లో చాలా వేడిగా ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఉష్ణోగ్రత 38 డిగ్రీల నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. వర్షం పడే అవకాశం లేదు. గాలి వేగం గంటకు 19 కి.మీ. ఉండే అవకాశం ఉంది.
రెండు జట్ల ప్రాబబుల్స్..
భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్.
న్యూజిలాండ్: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, జార్జియా ప్లిమ్మర్, అమేలియా కెర్, బ్రూక్ హాలిడే, మేడీ గ్రీన్, ఇజ్జీ గేజ్, లీ తహుహు, మోలీ పెన్‌ఫోల్డ్, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్.
ఇవి కూడా చదవండి :
Home Loan: హోమ్ లోన్ తీసుకుంటున్నారా? కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!
Salt Usage: ఉప్పు లేనిదే ముద్ద దిగడంలేదా? అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే.. ఎందుకంటే..