Crime News: రాజస్థాన్‌లో మానవత్వాన్ని సిగ్గుపడేలా ఓ భయంకర ఘటన వెలుగులోకి వచ్చింది. అల్వార్ జిల్లాలో ఓ మహిళపై ఏడుగురు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఏప్రిల్ 24న రాత్రి ఇంటి బయటకు వచ్చిన ఆ మహిళను ముగ్గురు వ్యక్తులు బలవంతంగా బొలెరో వాహనంలో ఎక్కించారు.
కదులుతున్న కారులో అత్యాచారం
కారులోనే ఆమెపై లైంగిక దాడి చేశారు. తరువాత ఓ రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి మరో నలుగురు వ్యక్తులు కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. మొత్తం 11 రోజుల పాటు ఆమెను బంధించి పదేపదే లైంగికదాడి చేశారు.
వీడియోలు తీసి బెదిరింపు
నిందితులు ఈ మొత్తం ఘటనను రికార్డ్ చేసి, “వీడియోలను సోషల్ మీడియాలో పెడతాం” అని ఆమెను బెదిరించారు. రూ. 3 లక్షలు ఆఫర్ చేస్తూ, అంగీకరించకపోతే చంపేస్తామని హెచ్చరించారు. చివరికి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను రోడ్డుపక్కన పడేసి నిందితులు పారిపోయారు.
ఇది కూడా చదవండి: Viral News: న్యూడ్ వీడియోలు తీసిన యువకులు.. చితకబాదిన యువతి
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
స్థానికుల సాయంతో ఇంటికి చేరుకున్న బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం చెప్పింది. కానీ మొదట్లో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని ఆమె ఆరోపించారు. కోర్టు ఆదేశాల మేరకు 2025 జూన్ 2న బాగద్ తిరాయ పోలీస్ స్టేషన్‌లో ఎట్టకేలకు కేసు నమోదు అయింది.
నిందితులు ఇంకా పరారీలోనే
ప్రస్తుతం కేసు దర్యాప్తు రామ్‌గఢ్ డీఎస్పీ సునీల్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కొనసాగుతోంది. నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని, త్వరలోనే వారిని అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. బాధితురాలి వైద్య పరీక్ష, కోర్టు వాంగ్మూలం కూడా త్వరలోనే పూర్తి కానున్నాయి.