Nalgonda

Nalgonda: నల్గొండలో దారుణం: ప్రియుడి భార్యపై పెట్రోల్‌ పోసి తగలబెట్టిన మహిళ..

Nalgonda: నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని కేతేపల్లి గ్రామంలో ఒక మహిళను సజీవ దహనం చేసిన అత్యంత దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఏర్పడిన గొడవలు చివరకు ఒక ప్రాణాన్ని బలితీసుకోగా, ఆరు నెలల పసికందును ఆసుపత్రి పాలు చేశాయి.

కేతేపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ల నగేశ్ భార్య మమత (25)కు, అదే గ్రామానికి చెందిన వంపు సుజాత అనే మహిళకు మధ్య శనివారం తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. నగేశ్‌తో సుజాతకు ఉన్న వివాహేతర సంబంధమే ఈ గొడవకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆగ్రహంతో ఊగిపోయిన సుజాత, మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ సమయంలో మమత తన ఐదు నెలల కుమారుడిని ఎత్తుకుని ఉండటంతో మంటలు ఇద్దరికీ అంటుకున్నాయి.

Also Read: Lucknow: కోతి అని పిలిచినా భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

ఈ ఘోర ప్రమాదంలో మమత అక్కడికక్కడే మృతి చెందగా, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాబును చికిత్స నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పసికందు సగం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఘటన అనంతరం నిందితురాలు సుజాత అక్కడి నుంచి పరారైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నగేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితురాలు సుజాత కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *