Crime News: కాకినాడ జిల్లా సామర్లకోటలోని సీతారామ కాలనీలో శనివారం అర్ధరాత్రి భయంకర ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి, ఆమె ఇద్దరు చిన్నారులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారన్న సమాచారం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది.
హత్యల తాలూకు వివరాలు ఇలా
సీతారామకాలనీలో ప్రసాద్ అనే వ్యక్తి తన భార్య మాధురి, కుమార్తెలు పుష్పకుమారి (5), జెస్సిలోవ (5)తో కలిసి నివాసం ఉంటున్నారు. ప్రసాద్ స్థానిక పరిశ్రమలో బొలెరో వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి డ్యూటీకి వెళ్లిన అతడు, ఆదివారం (ఆగస్టు 3) ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు.
అయితే ఇంట్లో కూర్చుని ఆ కుటుంబం కనిపించకపోవడం తో షాక్‌కు గురయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా భార్య, ఇద్దరు కుమార్తెలు రక్తపు మడుగులో పడి ఉండడం చూసి కంగారుపడ్డాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఇది కూడా చదవండి: Crime News: దారుణం.. తల్లి, ఇద్దరు కుమార్తెలు హత్య
తలలపై బలమైన దెబ్బలు
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మాధురి, పుష్పకుమారి, జెస్సిలోవల తలలపై బలమైన దెబ్బలతో హత్య చేసినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేశారు.
పోలీసుల విచారణ కొనసాగుతోంది
ఈ ఘటనపై పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు, జిల్లాకె ఎస్పీ బిందు మాధవ్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ప్రాతినిధ్యం మేరకు ప్రసాద్‌ను స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు విచారిస్తున్నారు. అత్యంత పాశవికంగా జరిగిన ఈ హత్యల కేసులో నిందితులను త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
శాంతమైన కాలనీలో హత్యలు… ప్రజల్లో భయం
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే సీతారామ కాలనీలో ఒక్కసారిగా జరిగిన ఈ హత్యలు స్థానికులను షాక్‌కు గురి చేశాయి. చిన్నారులను కూడా క్షమించకుండా చేసిన ఈ దాడి పై ప్రజల్లో ఆవేశం వ్యక్తమవుతోంది.