Virat Kohli

Virat Kohli: ఆర్సీబీ కప్ కొడితే కోహ్లీ రిటైర్ అవుతాడా..?

Virat Kohli: పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ గత నెలలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అతని నిర్ణయం మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఎందుకంటే అంతరించిపోతున్న టెస్ట్ క్రికెట్ కు తన స్టైలిష్ బ్యాట్‌తో ప్రాణం పోసింది విరాట్. కోహ్లీ ఇప్పటికే టెస్టుల నుంచి, అంతర్జాతీయ టీ20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. అతను ప్రస్తుతం భారతదేశం తరపున వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఇదే సమయంలో కోహ్లీ ఇప్పుడు ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతాడనే ప్రచారం జోరందుకుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇవాళ టైటిల్ పోరులో పంజాబ్ తో తలపడనుంది. ఈసారి కోహ్లీ తన తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంటాడని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఒకవేళ కప్ గెలిస్తే ఐపీఎల్ కు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడనే సోషల్ మీడియాలో సరికొత్త చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ కోహ్లీ కీలక ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి: Lokesh Shakalo Coverts: బిగ్‌ ఎక్స్‌పోజ్‌‌: హార్డ్‌ కోర్ జగన్ బ్యాచ్ అంతా విద్యా శాఖలోనే?

కోహ్లీ గురించి అరుణ్ ధుమాల్ ఏమన్నాడంటే?
టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని అరుణ్ ధుమల్ విరాట్ కోహ్లీని కోరారు. గతంలో BCCI కోశాధికారిగా ఉన్న ధుమాల్ ఇప్పుడు ఆ సంస్థతో అధికారిక సంబంధం లేదు కానీ IPL BCCI నియంత్రణలో ఉన్నందున అతను ఇప్పటికీ బోర్డు అధికారిగా ఉన్నాడు. ‘‘కోహ్లీ టీ20లు, టెస్టుల నుంచి రిటైర్ అయిన తర్వాత.. కింగ్ మ్యాజిక్‌ను చూడటానికి వన్డేలు, ఐపీఎల్ మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజల్లో మరో భయం మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారి ఐపీఎల్ కప్ కొట్టడానికి అడుగు దూరంలో నిలిచింది. ఒకవేళ కప్ గెలిచినా కోహ్లీ ఐపీఎల్‌కు వీడ్కోలు చెప్పడు. అలా జరుగుతుంది అని నేను అనుకోవడం లేదు’’ అని ధుమాల్ అన్నారు.విరాట్ క్రికెట్ ప్రపంచానికి ఒక గొప్ప వరమని.. ఐపీఎల్‌లో ఆర్సీబీ గెలిస్తే తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోహ్లీని కోరతానని ధుమాల్ స్పష్టం చేశారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *