Allu Arjun

Allu Arjun: బన్నీ తన రికార్డు తానే బద్దలు కొడతాడా?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్‌తో పాటు సోషల్ మీడియా, ఓటీటీ, టీవీల్లో భారీ ఆదరణ సొంతం చేసుకున్నాడు. తక్కువ మంది స్టార్స్‌కే సాధ్యమయ్యే ఈ రీచ్‌లో అల్లు అర్జున్ సినిమాలు బుల్లితెరపై బాగానే కనిపిస్తాయి. ప్రతి సినిమాకూ రిపీట్ వాల్యూ, ఆదరణ అసామాన్యం. గతంలో ఆయన చిత్రాలు ‘అల వైకుంఠపురములో’, ‘పుష్ప: ది రైజ్’ టీవీల్లో టీఆర్‌పీ రికార్డులు సృష్టించాయి.

‘అల వైకుంఠపురములో’ 29కి పైగా టీఆర్‌పీ పాయింట్స్‌తో తెలుగు బుల్లితెర ఆల్‌టైం నెంబర్ 1గా నిలిచింది. అయితే, ‘పుష్ప: ది రైజ్’ 25 టీఆర్‌పీ పాయింట్స్‌తో ఈ రికార్డును అందుకోలేకపోయింది.ఇప్పుడు ‘పుష్ప 2: ది రూల్’ స్టార్ మా ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా టెలికాస్ట్ కానుంది.

Also Read: Viral News: AI సహాయంతో ప్రాణం పోసుకున్న అమూల్ గర్ల్

Allu Arjun: ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసినట్లే బుల్లితెరపై కూడా సంచలనం సృష్టిస్తుందా? పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ ‘బంటు’ రికార్డును బద్దలు కొట్టి కొత్త చరిత్ర లిఖిస్తాడా? లేక రికార్డుల రేసులో వెనుకబడతాడా? అనేది ఉత్కంఠగా మారింది. అభిమానులు, ప్రేక్షకులు ఈ ప్రీమియర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప 2’ టీఆర్‌పీ రేసులో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!

కింగ్‌డమ్ – అధికారిక టీజర్ ఇక్కడ చూడండి: 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *