Saira Banu: ఎ.ఆర్. రెహమాన్, అతని భార్య సైరాబాను పరస్పర అవగాహనతో విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటన వచ్చిన దగ్గర నుండి సోషల్ మీడియా వేదికగా రకరకాల షికార్లు పుకార్లు చేస్తున్నాయి. రెహమాన్ శిష్యురాలు సైతం అదే సమయంలో తన భర్తకు విడాకులు ఇవ్వడంతో రెహ్మాన్ వ్యక్తిత్వ హవనానికీ కొందరు పాల్పడ్డారు. దాంతో రెహమాన్ పిల్లలతో పాటు లాయర్లు సైతం దీనిని ఖండించారు. తాజాగా రెహమాన్ భార్య సైరాబాను ఓ సందేశాన్ని విడుదల చేశారు. అనారోగ్య కారణంగా తాను ప్రస్తుతం ముంబైలో చికిత్స తీసుకుంటానని, త్వరలో చెన్నయ్ వస్తానని చెప్పారు. రెహమాన్ అద్భుతమైన వ్యక్తి అని, అతన్ని తానెంతో ప్రేమిస్తున్నానని తెలిపారు. రెహమాన్ పై ఎవరూ అసత్య ఆరోపణలు చేయకూడదని ఆమె కోరారు.