Crime News: తన ప్రేమికుడి సహకారంతో భర్తను కత్తితో పొడిచి చంపేసింది ఒక మహిళ. తరువాత మృత దేహాన్ని ముక్కలుగా చేసింది. ఆ ముక్కలను సిమెంట్ నింపిన డ్రమ్ములో వేసి మూత వేసింది. ఈ దారుణ సంఘటన మీరట్ లో చోటు చేసుకుంది. పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
మీరట్ లోని ఇందిరా నగర్‌లో ఈ సంఘటన జరిగింది. మర్చంట్ నేవీ ఉద్యోగి సౌరభ్ రాజ్‌పుత్ (29) మార్చి 4న కనిపించకుండా పోయాడు. ఈ విషయం గురించి సమాచారం అందిన తర్వాత దర్యాప్తు ప్రారంభించినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) ఆయుష్ విక్రమ్ సింగ్ తెలిపారు. అనుమానం ఆధారంగా, పోలీసులు అతని భార్య ముస్కాన్ (27) – ఆమె ప్రేమికుడు సాహిల్ (25) లను అదుపులోకి తీసుకున్నారని ఆయన చెప్పారు. విచారణలో, మార్చి 4న సౌరభ్‌ను కత్తితో పొడిచి చంపినట్లు ఇద్దరూ అంగీకరించారు.
ఇది కూడా చదవండి: Marri Rajasekhar Resigns: వైసీపీకి మరో ఎదురుదెబ్బ.. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా!
ఆ తర్వాత ఇద్దరూ అతని మృతదేహాన్ని ముక్కలుగా చేసి, అవశేషాలను డ్రమ్‌లో వేసి, సిమెంట్‌తో మూసివేసారని ఎఎస్పీ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. సౌరభ్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు. బాధితుడి కుటుంబం చేబూతున్నదాని ప్రకారం, సౌరభ్ ఫోన్ నుండి ముస్కాన్ మెసేజెస్ పంపిస్తూ అతని కుటుంబాన్ని తప్పుదోవ పట్టించింది.
నేరం చేసిన తర్వాత, ఆమె సాహిల్‌తో కలిసి ఒక కొండ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లిందని సింగ్ చెప్పారు. బ్రహ్మపురి ఇంద్రానగర్ ఫేజ్ 2కి చెందిన సౌరభ్ 2016లో గౌరీపురానికి చెందిన ముస్కాన్ రస్తోగిని ప్రేమ వివాహం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. వారిద్దరి కుటుంబాలు దీనికి అంగీకరించకపోవడంతో.. ఆ జంట తమ మూడేళ్ల కుమార్తెతో ఇంద్రానగర్ ఫేజ్ 1లోని అద్దె ఇంట్లో విడివిడిగా నివసిస్తున్నారని పోలీసులు తెలిపారు.

