Dacoit: యంగ్ హీరో అడివి శేష్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్నాడు. అందులో ఒకటి ‘డెకాయిట్’ కాగా మరొకటి ‘జి-2’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘డెకాయిట్’ను అన్నపూర్ణ స్టూడియస్ సమర్పణలో యార్లగడ్డ సుప్రియ నిర్మిస్తోంది. ఈ సినిమాలో తొలుత హీరోయిన్ గా శ్రుతీహాసన్ ను ఎంపిక చేసి కొంతమేర చిత్రీకరణ కూడా జరిపారు. అయితే ఆ తర్వాత ఆమె ఆ ప్రాజెక్ట్ నుండి వైదొలగింది. ఇప్పుడా స్థానంలో మరో నాయికను ఎంపిక చేశారు.
ఇది కూడా చదవండి: Weekend Alcohol: వీకెండ్ మందు.. బంద్ చేయకపోతే తప్పవు ఇబ్బందులు.
Dacoit: డిసెంబర్ 17 అడివి శేష్ బర్త్ డే సందర్భంగా ఆ హీరోయిన్ ఎవరు అనేది ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. కళ్ళు మాత్రమే కనిపించేలా ఓ పోస్టర్ నూ సోమవారం విడుదల చేశారు. దానిని చూసిన చాలామంది ‘సీతారామం’ ఫేమ్ మృణాళ్ ఠాకూర్ అనే విషయాన్ని పసికట్టేశారు. మరి అడివి శేష్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానుల కోసం మంగళవారం ఏ స్పెషల్ అంశాలను అందిస్తారో చూడాలి. ‘మేజర్’ తరహాలోనే ఈ రెండు సినిమాలు సైతం పాన్ ఇండియా మూవీస్ గా రాబోతున్నాయి

