Neha Shetty

Neha Shetty: రాధిక ఏమైనట్టు?

Neha Shetty: ‘మెహబూబా’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన నేహా శెట్టి, ఇప్పటివరకు మిడ్-రేంజ్ హీరోలతోనే జత కట్టింది. సందీప్ కిషన్‌తో ‘గల్లీ బాయ్’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, సిద్ధూ జొన్నలగడ్డతో ‘టిల్లు’, కార్తీకేయతో ‘బెదురులంక’, కిరణ్ అబ్బవరంతో ‘రూల్స్ రంజన్’, విశ్వక్ సేన్‌తో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో నటించింది.ఈ సినిమాల్లో ‘టిల్లు’ తప్ప మిగిలినవన్నీ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యాయి. రాధిక పాత్ర బాగా పాపులర్ అయినప్పటికీ, నేహా కెరీర్ మాత్రం ఊపందుకోలేకపోతోంది. గ్లామర్, నటనలో రాణిస్తూ, తన పూర్తి సామర్థ్యాన్ని చూపించినప్పటికీ, ఆమెకు సరైన విజయం దక్కడం లేదు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ విడుదలై దాదాపు ఏడాది కావస్తోంది, కానీ కొత్త సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్ లేదు. సోషల్ మీడియాలో కొన్ని కొలాబరేషన్స్‌తో సమయం గడుపుతున్న ఈ అమ్మాయి, కొత్త ప్రాజెక్టుల గురించి అధికారిక ప్రకటనలు ఏవీ చేయలేదు. అయితే, పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటిస్తోందని, అలాగే రిషబ్ శెట్టి రాబోయే చిత్రాల్లో ఒకదానిలో హీరోయిన్‌గా కనిపించనుందని కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. రాధిక తిరిగి రాక కోసం టాలీవుడ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేహా శెట్టి మళ్లీ ఎప్పుడు తెరపై సందడి చేస్తుందో చూడాలి!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  RC 16: జెట్ కంటే స్పీడ్ లో RC 16 షూటింగ్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *