Snake: పాము కాటు ఒక వ్యక్తిని క్షణంలో చంపేస్తుంది. పామును చూస్తే ఎంతటివారైనా వణికిపోతారు. వర్షాకాలం, చలికాలం మొదలైతే ఇంటి చుట్టూ పాములు దర్శనమిస్తున్నాయి. చలికాలంలో వెచ్చదనం కోసం పాములు ఇంట్లోకి వస్తాయి. ఈ పాములు మూలల్లో దాక్కుంటాయి. ఎలుకలు, కప్పలను వెతుక్కుంటూ పాములు ఇళ్లల్లోకి వస్తాయి. అయితే కొన్ని ట్రిక్కులు ఉపయోగిస్తే ఇంటికి వచ్చిన పామును సులువుగా తరిమి కొట్టవచ్చు.
పాములు కొన్ని వాసనలను తట్టుకోలేవు. కాబట్టి ఇంట్లో పాము కనిపిస్తే ఫినైల్, బేకింగ్ సోడా, ఫార్మాలిన్ లేదా కిరోసిన్ కలిపిన నీళ్లతో పిచికారీ చేయాలి. కిరోసిన్ వాసనకు పాములు పారిపోతాయి. పాము దాక్కున్న చోట కిరోసిన్ కలిపిన నీళ్లను చల్లితే పాములు ఇంట్లో నుంచి బయటకు వస్తాయి.
ఇది కూడా చదవండి: Coriander Health Benefits: కొత్తిమీర ప్రయోజనాలు.. ఇవి తప్పక తెలుసుకోండి!
Snake: హిట్ లేదా బైగాన్ వంటి క్రిమిసంహారక స్ప్రేలు కెమికల్ వాసనను కలిగి ఉంటాయి. ఇది పాములను తరిమికొట్టడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ స్ప్రేని నేరుగా పాముపై పిచికారీ చెయొద్దు. దాని చుట్టూ ఉన్న ప్రాంతాన్ని పిచికారీ చేయాలి. పాములు దాక్కున్న ప్రదేశాల్లో కొన్ని కెమికల్ ఆయిల్‌ను స్ప్రే చేయడం వల్ల అవి షాకై బయటకు వస్తాయి. పాములను తరిమికొట్టేందుకు సల్ఫర్ ఆధారిత స్నేక్ రిపెలెంట్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.
వెల్లుల్లి, ఉల్లిపాయల వాసనను పాములు తట్టుకోలేవు. ఇంటి బయట వెల్లుల్లి-ఉల్లి మొక్కలు నాటినా.. దాని ముక్కలు ఉంచినా పాములు పారిపోతాయి. వీటితో పాటు ఇంటి చుట్టూ చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. అయితే ఇంట్లోకి వచ్చిన పాములను చంపకూడదు. స్నేక్ క్యాచర్స్‌కు ఫోన్ చేస్తే వారు వచ్చి దాన్ని పట్టుకెళ్తారు.