CM Chandrababu: ఉమ్మడి విశాఖ జిల్లా టీడీపీ సమీక్ష సమావేశం సుదీర్ఘంగా సాగింది. పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చలు జరిపారు. సమావేశం మామూలుగా సాగలేదు. ఓ నేరశక్తిని రాజకీయ రంగంలోకి మళ్ళీ ప్రవేశపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తీవ్ర హెచ్చరికలు చేశారు.
ఏపీకి తిరిగి వచ్చిన భూతం
ఏపీలో ఓ బూతం తిరిగి లేచిందని అందరు భయపడుతున్నారు. కానీ నేనొకటే చెబుతున్నాను. ఆ భూతాన్ని నేనే భూస్థాపితం చేశాను. ఇప్పుడు అది మళ్ళీ లేస్తే… ప్రజాస్వామ్యానికి ముప్పే! అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాజకీయాలు తమాషా కాదని, నేరాలు చేసి ఎదుటి వారిపై నెట్టే విధానాన్ని ఖండించారు.
బాబాయ్ మరణం రాజకీయ నాటకం
ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఎన్నికల సమయంలో తెల్లవారితే ‘బాబాయ్ చనిపోయాడు’ అని ఓ వార్త వచ్చింది. గుండెపోటుతో మరణించారని అన్నారు. నేనూ నమ్మాను. కానీ సాయంత్రానికి విషయం బయటపడింది. అది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు! మృతిని రాజకీయంగా ఉపయోగించుకోవడం.. నాటకాలు వేయడం.. ఆ నాటకాల రాయుడే దానికి సూత్రధారి, అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
“కోడి కత్తి నుంచి ఇంటి మంటలు దాకా – అన్నీ నాటకాలే”
పోలీసులపై దాడులు, సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వకపోవడం, నాటకాలతో ప్రజలను తప్పుదారి పట్టించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడి కత్తి నాటకం, గులకరాయి నాటకం, ఇంటి దగ్గర మంటల నాటకం – ఇవన్నీ ప్రజలకే స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజంగా నిజాయితీ ఉంటే సీసీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వరు?” అని ప్రశ్నించారు.
“ఇది సీబీఎన్ సర్కార్ – రౌడీయిజానికి చోటు లేదు”
ఓ పక్షంగా ఉన్నా రౌడీయిజం చేస్తానని హెచ్చరించేవారికి సీఎం చంద్రబాబు గట్టి శబ్దం చెప్పారు. ఇక్కడ ఉంది టీడీపీ – ఒకే మాట. పోలీసులపై దాడి చేస్తాం, రౌడీయిజం చేస్తాం అంటారా? మీ నోరు మూయించే శక్తి మాలో ఉంది. 1996–97లో తీవ్రవాదాన్ని, ఫ్యాక్షనిజాన్ని, మత ఘర్షణలను అరికట్టినవాడిని నేనే,అని స్పష్టం చేశారు.
“పులివెందుల మార్క్ రాజకీయాలకు ఇక చెక్”
రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయాలకు తాను చెక్ పెట్టానని గుర్తు చేశారు. పులివెందుల మార్క్ రాజకీయాలు చేస్తారా? అలాంటి రాజకీయాలకు తోక కట్ చేస్తాను, అని ఘాటుగా హెచ్చరించారు.


