War 2 Twitter Review: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వార్ 2’ సినిమా విడుదలయ్యింది. యువ తారక్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.
అభిమానుల నుండి అద్భుతమైన స్పందన
సినిమా చూసిన ప్రేక్షకులు, ముఖ్యంగా ఓవర్సీస్ లో, సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య పోటాపోటీ నటన, హాలీవుడ్ స్థాయి యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఎన్టీఆర్ ఎంట్రీ అదుర్స్
చాలామంది ప్రేక్షకులు ఎన్టీఆర్ ఎంట్రీని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన తొలి సన్నివేశంలోనే కండలు తిరిగిన శరీరంతో, ఎంతో స్టైలిష్ గా కనిపించారని తెలిపారు. ఈ సన్నివేశం చూసి థియేటర్లలో అభిమానులు పిచ్చెక్కిపోయారని అంటున్నారు. ఎన్టీఆర్ తన నటనతో సినిమా స్థాయిని పెంచారని కూడా పేర్కొన్నారు.
హృతిక్ రోషన్ కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్
హృతిక్ రోషన్ కూడా తనదైన శైలిలో యాక్షన్ సీన్లలో అదరగొట్టారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ ఒకరికొకరు పోటీ పడుతూ నటించారు. వారిద్దరి పోరాట సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉన్నాయి.
దర్శకుడు అయాన్ ముఖర్జీ హాలీవుడ్ స్థాయిలో సినిమాను తెరకెక్కించారు. యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా కార్ ఛేజింగ్ ట్రైన్ ఫైట్ అభిమానులను మెప్పించాయి. సంచిత్, అంకిత్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు మరింత బలం చేకూర్చింది. సినిమాలో ఒక మంచి ఇంటర్వెల్ ట్విస్ట్, ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఉన్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. కియారా అద్వానీ పాత్ర కూడా బాగానే ఉందని పేర్కొన్నారు. సలామే పాటలో ఇద్దరి డ్యాన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తం మీద, సినిమా యాక్షన్ ప్రియులకు విందు అని ప్రేక్షకులు అంటున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం ఓవర్సీస్ ప్రేక్షకుల నుండి వచ్చిన పాజిటివ్ రివ్యూల ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. సినిమాలోని అసలు కథ, పాత్రల గురించి వివరాలు తెలుసుకోవాలంటే థియేటర్లకు వెళ్ళి చూడాలని ప్రేక్షకులు సూచిస్తున్నారు.
Anna @tarak9999 Shirtless Scene 💥🤯
Goosebumps Feels, Theatre Erupt, #JrNTR Fans Going On Mad To See Him In Shirtless Avatar 🤯🤯🤯🤯🥵#War2 pic.twitter.com/Z930gVTKrP
— NTR TREND (@NTR_TREND8) August 13, 2025
War2Review – 4.5/5 ⭐⭐⭐⭐✨
High octane action, unmatched charisma from #HrithikRoshan & #JnrNTR, and sizzling #KiaraAdvani moments. Interval block gives goosebumps, but the grand climax steals the show .#War2Review #Coolie pic.twitter.com/p5yneGXfHK— 𝐴ᵏի✝️𝚊𝗿 (@YesImsrkian123) August 14, 2025
War 2 Review
⭐️ 🌟🌟 ⭐️.5
What a movie climax is Fire 🔥
No Spoilers just Go and watch #War 2 pic.twitter.com/tq8KIYHg3h— CINEMA 🇮🇳 (@InstantCricinfo) August 13, 2025