WAR 2: హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘వార్ 2’ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలో సంచలనం సృష్టించబోతుంది అంటూ మూవీ టీం తాజాగా తెలిపింది. దీంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఇద్దరు పవర్ ఫుల్ హీరోస్ ఒక్క తెరపై జంటగా కనిపిస్తే ఆ సందడి పీక్స్‌లో ఉంటుంది. హృతిక్, ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ చూడడానికి రెండు కళ్లు సరిపోవని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నిజానికి ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 14న రిలీజ్ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. కానీ ఇటీవల హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడిందని.. అనుకున్న టైంకు మూవీ రిలీజ్ కాదేమో అనే అనుమానాలు నెలకొన్నాయి. కానీ మొత్తానికి క్లారిటీ వచ్చేసింది.
