Vizag: విశాఖపట్నం జిల్లాలో 2021లో సంచలనం సృష్టించిన ఆరు హత్యల కేసులో ఎట్టకేలకు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. పెందుర్తి మండలం జుత్తాడ గ్రామంలో జరిగిన ఈ దారుణ సంఘటనకు ప్రధాన నిందితుడిగా ఉన్న బత్తిన అప్పలరాజుకు కోర్టు మరణశిక్ష విధించింది. నాలుగేళ్ల పాటు సాగిన విచారణ అనంతరం న్యాయస్థానం ఈ తీర్పు వెల్లడించడంతో మృతుల కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
కుటుంబ పరువు కోసం కిరాతక హత్యలు
2021 ఏప్రిల్ 15న అప్పలరాజు అనే వ్యక్తి తన వ్యక్తిగత కుట్ర, పాత కక్షల నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. హత్యలైనవారు:
విజయ్ అత్త అల్లు రమాదేవి
భార్య బొమ్మిడి ఉషారాణి
ఇద్దరు పిల్లలు ఉదయనందన్, రిషిత
మేనత్త నెక్కళ్ల అరుణ
తండ్రి బమ్మిడి రమణ
హత్యలకు మూలకారణం: కుమార్తపై లైంగిక వేధింపులు
పోలీసుల విచారణలో shocking వివరాలు వెలుగులోకి వచ్చాయి. అప్పలరాజు కుమార్తెపై విజయ్ కిరణ్ లైంగికంగా వేధించాడని, మత్తుమందు కలిపిన పానీయం ఇచ్చి అత్యాచారానికి పాల్పడి, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేశాడని అప్పలరాజు కుటుంబం 2018లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదై విజయ్‌ను అరెస్టు చేశారు.
ప్రతీకారం తీర్చుకున్న అప్పలరాజు
తన కుమార్తె జీవితం నాశనమైనందుకు, ఊరిలో పరువు పోయినందుకు బమ్మిడి రమణ కుటుంబమే కారణమని భావించిన అప్పలరాజు… వారిపై ప్రతీకారం తీర్చుకునే దుష్టప్రయత్నం చేశాడు. ఏప్రిల్ 15, 2021న పూర్వ ప్రణాళికతో రమణ కుటుంబ సభ్యులపై దాడి చేసి, ఒకేసారి ఆరుగురిని గొడ్డలితో నరికి చంపాడు.
నిర్దాక్షిణ్యాన్ని ప్రతిబింబించిన తీర్పు
ఈ కేసులో ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తీర్పును తాజాగా విశాఖపట్నం సెషన్స్ కోర్టు వెలువరించింది. “సామాజికంగా తీవ్ర కలకలం రేపిన, ఆగమ్యగోచరమైన ఈ హత్యల వెనుక ఉన్న నిష్ఠురతకు దృష్టిగా మరణశిక్ష తప్పదని” న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
ఈ తీర్పుతో మృతుల కుటుంబ సభ్యులు “న్యాయం జరిగింది” అని భావిస్తూ కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.