Viral Video: టీ అమ్మితే ఎంత సంపాదించవచ్చు? ఈ ప్రశ్నకు ఎవరైనా ఏముంది మహా అయితే రోజుకు ఓ ఐదారు వందలు వస్తే చాలా ఎక్కువ అని చెబుతారు. కానీ ఒక్క చాయ్ అమ్మడం ద్వారా రోజుకు ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు ఒక వ్యక్తి. అవును.. మహా కుంభమేళాలో చాయ్ దుకాణం నడుపుతున్న ఒక యువకుడు రోజుకు ఐదువేలకు పైగా ఆదాయం వస్తోందని చెబుతున్నాడు. చెప్పడం అంటే అలా ఇలా కాదు.. ఒక వీడియో చేసి.. దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది.
మహా కుంభమేళా భారతదేశంలో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి భారీ స్థాయిలో జరుగుతుంది. ప్రస్తుతం అక్కడ జనవరి 13 నుంచి మహా కుంభమేళా జరుగుతోంది. లక్షలాదిగా భక్తులు అక్కడకు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు చేయడానికి హాజరు అవుతున్నారు.
వైరల్ అవుతున్న టీ మాస్టర్
Viral Video: 45 రోజుల పాటు జరిగే మహా కుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుండి భక్తులు తమ పూజలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటివరకు కోట్లాది మంది ప్రజ్ఞారాజ్‌లో పవిత్ర స్నానాలు ఆచరించారు. మహా కుంభమేళాలో అనేక దుకాణాలు పనిచేస్తున్నాయి. వాటిలో ఒకటి, ఒక టీ దుకాణం, ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Viral Video: శుభం ప్రజాపత్ అనే యువకుడు మహా కుంభమేళాలో టీ అమ్ముతున్నాడు. మహా కుంభమేళాలో ఆయన ఒక చిన్న టీ స్టాల్ ఏర్పాటు చేశారు. అతను ఒక్క టీ అమ్మడం ద్వారానే రోజుకు రూ.5,000 సంపాదిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Viral Video: అందులో, అతని టీ దుకాణం ఉదయం చాలా రద్దీగా ఉంటుంది. అయితే, మధ్యాహ్నం సమయంలో అమ్మకాలు నెమ్మదిగా ఉంటాయి. అందువల్ల, ఆ సమయంలో తాను విరామం తీసుకుంటానని చెప్పాడు. అలాగే, సాయంత్రం వేళల్లో రద్దీగా ఉంటుంది. ఆ సమయంలో అమ్మకాలు చాలా ఎక్కువ ఉంటాయని అతను చెబుతున్నాడు.
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
Viral Video: సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు దీనిపై కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగం కంటే ఈపని చాలా బాగుంది కదా అని ఒకరు కామెంట్ చేశారు. ఒక నెటిజన్ ఇది చూసిన తన తమ్ముడు చదువు మానేసి టీ దుకాణం పెట్టాలని అనుకుంటున్నాడని రాసుకొచ్చాడు. ఒక వ్యక్తి టీ దుకాణంలో ఇన్ని డబ్బులు వస్తాయంటే అందరూ అదే పని చేస్తారు అంటూ కామెంట్ పెట్టాడు.