Veera Dheera Sooran

Veera Dheera Sooran: ‘వీర ధీర శూరన్’ సంక్రాంతి రేస్ నుంచి అవుట్!?

Veera Dheera Sooran: బహుముఖ ప్రజ్ఞాశాలి విక్రమ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘వీర ధీర శూరన్’. ఇటీవల విక్రమ్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘తంగలాన్’ డిజాస్టర్ అయింది. రాబోయే ‘వీర ధీర శూరన్’ పైనే విక్రమ్ ఆశలన్నీ. ఈ సినిమాకు ఎస్.యు. అరుణ్‌ కుమార్ దర్శకుడు. హెచ్ ఆర్ పిక్చర్స్ పై ఈ సినిమాను రియా శిబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. విశేషం ఏమంటే ముందుగా సెకండ్ పార్ట్ రిలీజ్ కాబోతోందట. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందని ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ సినిమాను రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న రిలీజ్ చేస్తారట. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పొంగల్ రేస్ నుంచి తప్పుకోవడంతో అజిత్ ‘విడాముయర్చి’, రామ్ చరణ్‌, శంకర్ ‘గేమ్ ఛేంజర్’, బాలా ‘వనంగాన్’ కు అడ్వాంటేజ్ కానుంది. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో విక్రమ్ కు జోడీగా దుస్సారా విజయన్ నటిస్తోంది. ఇతర పాత్రల్లో యస్.జె. సూర్య, సూరజ్ వెంజారమోడు కనిపించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *