Vijayawada: డ్రగ్ మాఫియాపై దాడులు కొనసాగుతున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రేవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు విజయవాడలో భారీగా గంజాయి పట్టివేత చేశారు. మొత్తం 248 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
సమాచారం మేరకు, ఈ గంజాయిని ఒడిశా నుంచి ఉత్తరప్రదేశ్‌కు తరలించేందుకు స్మగ్లర్లు ప్రణాళిక సిద్ధం చేశారు. రవాణా సమయంలో విజయవాడను మధ్య కేంద్రంగా ఉపయోగిస్తూ, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా యూపీకి గంజాయి తరలించేందుకు ప్రయత్నం చేశారు.
ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న నలుగురు స్మగ్లర్లను DRI అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని విచారిస్తే, మాదకద్రవ్య రవాణా నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు.అధికారులు కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
