Vijay Sethupathi: ప్రసిద్ధ నటుడు విజయ్ సేతుపతి సేవలోనే నిజమైన ఆనందం ఉందని చెప్పారు. తాను సంపాదించే డబ్బు వ్యక్తిగత సుఖం కోసం కాదు, సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఉపయోగిస్తానని తెలిపారు. ఇతరులకు సహాయం చేయడమే తన జీవిత లక్ష్యమని చెప్పారు.
గత ఆరేళ్లుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు ప్రతి నెల రూ.1.5 లక్షలు ఖర్చు చేస్తున్నానని వెల్లడించారు. అలాగే పేదలకు ఉచితంగా దుస్తులు పంపిణీ చేస్తున్నానని చెప్పారు. డబ్బు సంపాదిస్తేనే ఇలాంటి సేవలు చేయగలనని, అలా చేయడం వల్లే తనకు నిజమైన సంతోషం కలుగుతుందని అన్నారు.
ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతో సొంతంగా ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించానని, కానీ ఆ సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో భారీ నష్టాలు ఎదురయ్యాయని చెప్పారు. కొన్ని సినిమాల నిర్మాతలు ఆర్థిక సమస్యల్లో ఉన్నప్పుడు తన రెమ్యూనరేషన్‌ను కూడా వదిలేశానని వెల్లడించారు.
ఇక తాను నటించిన “గాంధీ టాక్స్” సినిమా జనవరి 30న విడుదల కానుందని తెలిపారు. మొదట్లో ఫలితంపై కొంత భయం ఉన్నా, ఇప్పుడు మంచి స్పందన వస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని ఇస్తుందని ఆశాభావం తెలిపారు.
