Vijay Rupani:

Vijay Rupani: మాజీ సీఎం విజ‌య్ రూపానీ మృత‌దేహం గుర్తింపు

Vijay Rupani: అహ్మ‌దాబాద్ విమాన ప్ర‌మాదంలో చ‌నిపోయిన గుజ‌రాత్ మాజీ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ మృత‌దేహాన్ని గుర్తించారు. గుర్తించిన మృత‌దేహం డీఎన్ఏతో కుటుంబ స‌భ్యుల డీఎన్ఏ స‌రిపోలింద‌ని వైద్యులు నిర్ధారించారు. దీనిని ఆ రాష్ట్ర హోంమంత్రి ధ్రువీక‌రించారు. ఆయ‌న మృతితో ఇప్ప‌టికీ కుటుంబ స‌భ్యులు తేరుకోలేక‌పోయారు.

Vijay Rupani: ఆసుప‌త్రి వైద్యులు గుజ‌రాత్ మాజీ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ మృత‌దేహాన్ని అప్ప‌గించ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న అంత్యక్రియ‌లు రాజ్‌కోట్‌లో నిర్వ‌హించేందుకు కుటుంబ స‌భ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్‌ నెల 12న జ‌రిగిన విమాన ప్ర‌మాదంలో విజ‌య్ రూపానీ మృతి చెందారు. ఆయ‌న మృతితో ప్ర‌ధాని మోదీ, ఇత‌ర ప్ర‌ముఖులు ఘ‌నంగా నివాళుల‌ర్పించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tamil Nadu: తమిళనాడులో గబ్బిలాల మాంసం కలకలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *