Vijay Deverakonda: ‘పుష్ప2’ తర్వాత రశ్మిక నటిస్తున్న చిత్రం ‘గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో విద్య కొప్పినీడితో కలసి ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకుడు. హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. ‘దసరా’ ఫేమ్ ప్రేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ‘పుష్ప2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకుడు సుకుమార్ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ చాలా బాగుంటుందని చెప్పాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇచ్చాడట. అంటే రియల్ గర్ల్ ఫ్రెండ్ సినిమా కోసం విజయ్ తన వాయిస్ ను అరువిచ్చాడన్న మాట. అంతే కాదు ‘పుష్ప2’ ప్రదర్శించే థియేటర్లలో ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్ ప్రదర్శిస్తున్నారు. మరి పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ కాబోతున్న ఈ ‘గర్ల్ ఫ్రెండ్’ కి బోయ్ ఫ్రెండ్ వాయిస్ ఏ మేరకు సహాయపడుతుందో చూద్దాం.
