Medaram Maha Jatara: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారిక సెలవులు ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ (VHP) డిమాండ్ చేసింది. ఈ నెల 30, 31 తేదీలలో ప్రభుత్వం సెలవు ఇవ్వాలని వీహెచ్‌పీ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ బాలస్వామి ఒక ప్రకటనలో కోరారు.
ఇది కూడా చదవండి: Ranveer Singh: వద్దు అన్న వినలేదు.. ఇపుడు రణ్‌వీర్‌సింగ్‌పై కేసు నమోదు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మేడారంలో క్యాబినెట్ భేటీ నిర్వహించినప్పటికీ, సెలవుల గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర అని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం, ఈ వేడుకలకు తగిన గుర్తింపు ఇవ్వడంలో వెనుకబడిందని బాలస్వామి విమర్శించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ పవిత్ర జాతర ప్రాముఖ్యతను గుర్తించి, అందరూ అమ్మవార్లను దర్శించుకునేలా తక్షణమే సెలవు ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
