Revanth Reddy

Revanth Reddy: మున్సిపల్ పోరుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్.. మంత్రులకు కొత్త బాధ్యతలు

Revanth Reddy: అమెరికా పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 1న తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు. రాష్ట్రానికి వచ్చిన వెంటనే ఆయన పాలన మరియు రాజకీయ అంశాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించనున్నారు. ఫిబ్రవరి 2న కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలు మరియు మంత్రులతో సీఎం కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, మంత్రులకు అప్పగించాల్సిన కొత్త బాధ్యతలతో పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల వ్యూహాలపై విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా సింగరేణి టెండర్ల వివాదం, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ పురోగతి వంటి అంశాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘంగా మంతనాలు జరిపే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: Ranveer Singh: వద్దు అన్న వినలేదు.. ఇపుడు రణ్‌వీర్‌సింగ్‌పై కేసు నమోదు..

మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ పర్యటన ముగిసిన వెంటనే ఫిబ్రవరి 3 నుంచి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార బరిలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 3న మిర్యాలగూడలో తన ప్రచారాన్ని ప్రారంభించి, ఆ తర్వాత వరుసగా 4న జగిత్యాల, 5న చేవెళ్ల, 6న భూపాలపల్లి, 7న మెదక్, 8న నిజామాబాద్‌లలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ పర్యటన ద్వారా అటు ప్రభుత్వ పనితీరును, ఇటు పార్టీ బలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *