Anil Ravipudi: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ 300 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్గా నిలిచింది. పూర్తి కామెడీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాతో వెంకీ, అనిల్ రావిపూడి హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే వీరి కాంబినేషన్లో మరో మూవీ రానుందని సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ విక్టరీ వేడుక కార్యక్రమంలో వెంకటేష్ ఈ విషయాన్ని వెల్లడించాడు.‘2027 సంక్రాంతికి మళ్లీ వస్తున్నాం’ అంటూ వెంకటేష్ తెలిపాడు. దీంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో మూవీ రానుందనేది కన్ఫర్మ్ అయ్యింది.
