Venkatramaiah Gari Taluka

Venkatramaiah Gari Taluka: థియేటర్లలో కన్నీళ్లు పెట్టించే సెంటిమెంట్!..”వెంకట్రామయ్య గారి తాలూకా” రివ్యూ!

Venkatramaiah Gari Taluka: కోమలి క్రియేషన్స్, ప్రైమ్ షో ఫిలిమ్స్ బ్యానర్స్ పై కోమల మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి నిర్మాతలుగా సతీష్ ఆవల రచన దర్శకత్వంలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వెంకట్రామయ్య గారి తాలూకా. దివిజ ప్రభాకర్, దినేష్ కుమార్ కదంబల, మురళీధర్ గౌడ్, సుధ, సత్యశ్రీ, సెల్వరాజ్ వర్మ తదితరులు కీలకపాత్రను పోషించిన ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించగా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా బుట్ట అనిల్ కుమార్ సినిమాటోగ్రఫీ వహించారు. నేడు విడుదలైన ఈ చిత్ర రివ్యూ విషయానికి వస్తే…

కథ :
ఒక పల్లెటూరిలో ఎంతో ఆనందంగా తన పిల్లలతో కలిసి ఉండే ఒక మధ్యతరగతి కుటుంబ కథగా చెప్పుకోవచ్చు. తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని పెళ్లిచేసి పంపించక వారెవరికి జీవితంలో సంతోషం ఉండదు. అది గమనించిన ఆ తండ్రి తనకు ఉన్న ఆస్తి అంతా అమ్మేసి వారి జీవితాలు చక్క పెట్టాలనుకుంటారు. అయితే ఈ ప్రయాణంలో వారిని సంతోషపడతాడా లేదా? అసలు ఆస్తులు అమ్ముకునేంత కష్టాలు ఏమొచ్చాయి? చివరకు వారి పిల్లలు సంతోషిస్తారా లేదా? వారి పిల్లలు తన కష్టాన్ని గుర్తిస్తారా లేదా? చివరికి ఆ కుటుంబం ఎటువంటి పరిస్థితికి చేరుతుంది? అని అనేక ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రం చూడాల్సిందే.

నటీనటుల నటన :
ఈ చిత్రంలో మనకు దివిజ ప్రభాకర్, దినేష్ కుమార్ కదంబల ప్రధాన జంటగా కనిపిస్తూ అటు ప్రేమ కథను అలాగే ఇటు కుటుంబ సెంటిమెంట్, ఎమోషన్స్ చాలా బాగా క్యారీ చేశారు. సినిమాలో గతంలో ఎన్నో చిత్రాలలో మనకు వివిధ పాత్రలో కనిపించిన సుధా గారు ఈ చిత్రంలో ఒక స్థిరమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా ఈ సినిమాలో మురళీధర్ గౌడ్ గారి పాత్ర గురించి చెప్పుకోవాలి. సినిమా అంతట తనదైన శైలిలో అద్భుతమైన ఘటన ప్రదర్శిస్తూ ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. మరి ముఖ్యంగా ఎమోషన్స్ బాగా ముందుకు తీసుకువెళ్లారు. అదేవిధంగా వివిధ పాత్రలో కనిపించిన ఇతర నటీనటులు అంతా తమ తమ పాత్రలకు న్యాయం చేస్తూ అద్భుతంగా నటించారు.

సాంకేతిక విశ్లేషణ :
ఒక సాధారణ పల్లెటూరి కుటుంబ కథను వెండి ధరపై చూపించడం అందరికీ చిన్న విషయంలో ఆయన పెట్టినప్పటికీ ఆ సినిమాను ప్రేక్షకులు తమ మదిలోకి తీసుకునే విధంగా ఈ చిత్ర దర్శకుడు వెండితెరపై చూపించడంలో గొప్ప విజయం సాధించారని చెప్పుకోవాలి. ఆ కథను వెండితెరపైకి తీసుకురావడంలో సినిమాటోగ్రాఫర్ చాలా బాగా చేశారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతంత మాత్రమే ఉంది. పాటలు పరవాలేదు. లొకేషన్స్, కలరింగ్ మాత్రం చాలా బాగున్నాయి. డబ్బింగ్ చాలా బాగా వచ్చింది. నిర్మాణంలో విలువలు బాగున్నాయి. అలాగే ఇతర సాంకేతిక విషయాలన్నీ బాగానే ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :
కథ, దర్శకత్వం, నటీనటుల నటన, ఎమోషన్స్.

మైనస్ పాయింట్స్ :
సంగీతం, కొన్ని సన్నివేశాలు స్లోగా ఉండటం.

సారాంశం :
కుటుంబ విలువలను, ప్రస్తుత పరిస్థితులను కంటికి కట్టినట్లు చూపిస్తూ ఎమోషన్స్ తో కుటుంబ సమేతంగా తప్పకుండా చూడవలసిన చిత్రం వెంకట్రామయ్య గారి తాలూకా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *