Venkatesh: సంక్రాంతి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వెంకటేష్, రాబోయే రెండేళ్లలో మరిన్ని ఆసక్తికర ప్రాజెక్టులతో అభిమానులను అలరించనున్నారు. మొదటగా, 2026 జనవరిలో చిరంజీవి నటిస్తున్న మెగా 157లో కీలక పాత్రలో కనిపించనున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం సంక్రాంతి బరిలో హైప్ సృష్టించనుంది. ఆ తర్వాత, 2026 వేసవిలో త్రివిక్రమ్‌తో జతకడుతూ ఫ్యామిలీ డ్రామాతో మెప్పించనున్నారు.
ఇది కూడా చదవండి: NAGA BABU: ఫేక్ వార్తలు నమ్మొద్దు.. మా అమ్మ బాగానే ఉంది..
ఈ కాంబోపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే ఏడాది అక్టోబర్‌లో దృశ్యం 3తో వెంకటేష్ మరోసారి థ్రిల్లర్ జోనర్‌లో సందడి చేయనున్నారు. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెలుగు, హిందీ, మలయాళంలో రిలీజ్ కానున్న ఈ సీక్వెల్‌లో అజయ్ దేవగన్ కూడా నటిస్తారని టాక్. చివరగా, 2027 జనవరిలో సంక్రాంతి వస్తున్నాం సీక్వెల్‌తో అనిల్ రావిపూడితో మరోసారి జతకట్టనున్నారు. ఈ నాలుగు చిత్రాలు వెంకటేష్ కెరీర్‌లో వైవిధ్యమైన పాత్రలతో మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి.
