Uttar pradesh: ఓ ఆర్మీ జవాన్‌పై ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ టోల్‌గేట్ సిబ్బంది దాడి చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రంగా స్పందించింది. టోల్‌గేట్ సిబ్బంది దాడి చేస్తున్న వీడియో వైరల్ కావడంతో ప్రజలంతా టోల్‌గేట్ సిబ్బందిపై దుమ్మెత్తిపోశారు. జవాన్‌కు మద్దతుగా నిలిచారు. అక్కడి స్థానికులు కూడా ఇదే చేశారు. ఆ టోల్‌గేట్‌పై దాడికి దిగారు.
Uttar pradesh: జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్ కేంద్రంగా రాజ్‌పుత్ రెజిమెంట్‌లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కపిల్ కవాడ్ సైనికుడిగా పనిచేస్తున్నారు. వరుస సెలవుల్లో కపిల్ కవాడ్ తన సొంతూరికి వచ్చారు. సెలవులు ముగిశాక ఆగస్టు 17న శ్రీనగర్‌కు తిరిగి బయలుదేరారు. కుటుంబంతో కలిసి ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు ఆయన వెళ్తుండగా, మీరట్ టోల్‌గేటు వద్ద ఆయన వెళ్తున్న వాహనం చాలా సేపు నిలిచిపోయింది.
Uttar pradesh: తాను వెళ్లే విమానం సమయం సమీపిస్తుండటంతో ఆందోళనతో ఆలస్యంపై టోల్‌గేట్ సిబ్బందిని ఆర్మీ జవాన్ కపిల్ కవాడ్ ప్రశ్నించారు. ఈ క్రమంలో టోల్ సిబ్బంది, జవాన్ కపిల్ కవాడ్ మధ్య వాగ్వాదం పెరిగింది. ఇదే అదనుగా భావించిన ఇతర సిబ్బంది మూకుమ్మడిగా ఆర్మీ జవాన్‌పై దాడికి దిగారు. ఓ స్తంభానికి కట్టేసి మరీ కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ దాడి దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Uttar pradesh: జవాన్‌పై దాడి చేసిన మీరట్ టోల్‌గేట్‌ను పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానికులు ధ్వసం చేశారు. అక్కడ ఉన్న కొందరు సిబ్బందిని చితకబాదారు. టోల్‌గేట్ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. కర్రలతో బాధారు. అప్పటికే ఆర్మీ జవాన్‌పై దాడికి బాధ్యులైన ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. టోల్‌గేట్ యాజమాన్యంపై రూ.20 లక్షల జరిమానా విధించారు.
Uttar pradesh: టోల్‌గేట్ నిర్వహించే భూని టోల్ ఏజెన్సీపై కఠిన చర్యలకు ఎన్‌హెచ్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఎలాంటి బిడ్డింగ్‌లో పాల్గొనకుండా బ్లాక్ లిస్టులో ఆ ఏజెన్సీని పెట్టేందుకు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. రగిలిపోయిన స్థానికులు టోల్‌గేట్‌ను ధ్వంసం చేశారు. నిందితులకు కఠిన శిక్షలు పడాలని స్థానికులతోపాటు దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు.

