Bus Accident

Bus Accident: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికులు ఏం చేశారో చూడండి

Bus Accident: కర్నూలు జిల్లా గోనెగండ్ల సమీపంలో మంగళవారం భయానక ఘటన చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు నుంచి కర్నూలు వైపు సుమారు 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బస్సు ఇంజన్ భాగం నుండి మొదలైన పొగ కాసేపటికే మంటలుగా మారడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

అయితే అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును పక్కకు ఆపి, అందరినీ క్రమంగా సురక్షితంగా కిందకు దింపాడు. ఒక్కో క్షణం ప్రాణాలకు ముప్పుగా మారిన పరిస్థితిని చాకచక్యంగా ఎదుర్కొన్న డ్రైవర్ ధైర్యానికి అందరూ అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి: Asia Cup 2025: చోటు దక్కేది ఎవరికి.. ఆసియాకప్‌నకు భారత జట్టు ఎంపిక నేడే

మంటలను గమనించిన స్థానిక యువకులు కూడా సంఘటన స్థలానికి చేరుకుని బకెట్లలో నీరు చల్లి మంటలను అదుపులోకి తెచ్చారు. కొద్ది సేపు రోడ్డుపై అగ్నికీలలు రేగినా, పెద్ద ప్రమాదం సంభవించకుండా పరిస్థితి అదుపులోకి రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం విశేషం. అయితే బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలను కొందరు స్థానికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *