Uttar pradesh Crime:ఇండోర్ రాజారఘువంశీ ఘటన తర్వాత దేశంలో ఆ తరహా వరుస ఘటనలు చోటుచేసుకుంటుండటం తీవ్ర కలకలం రేగుతున్నది.. సభ్యసమాజం ఎటు వైపు పయనిస్తున్నదోనని ఆందోళన నెలకొంటున్నది.. అసలేం జరుగుతున్నదని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటున్న వైనం.. ఇటీవలే తెలంగాణలోని గద్వాల్ జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన చోటుచేసుకున్నది. ఇలాంటి తరహా కాకపోయినా, అదే రీతిలో భార్య వివాహేతర బంధంతో కుటుంబం చిన్నాభిన్నమైన సంఘటన చోటుచేసుకున్నది.
Uttar pradesh Crime:ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్‌రాజ్ ప్రాంతానికి చెందిన నిషాద్ అనే వ్యక్తికి సితార అనే యువతితో ఇటీవలే వివాహం జరిగింది. శోభనం రోజే భర్త అవాక్కయ్యే విషయాన్ని ఆ యువతి చెప్పేసింది. తనను ముట్టుకుంటే 35 ముక్కలు చేసి చంపుతానని బెదిరించింది. ఇదే సమయంలో తన ప్రేమ వ్యవహారాన్ని పూసగుచ్చినట్టు చెప్పింది. తనకు వరుసకు మేనల్లుడైన అమన్ అనే వ్యక్తిని తాను ప్రేమించానని, అతనితోనే వెళ్లిపోతానని, ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించింది. అమన్ కూడా నిషాద్‌కు ఫోన్ చేసి తన స్నేహితులతో కలిసి చంపేస్తానని బెదిరంచాడు. అప్పటి నుంచి గమ్మునున్నాడు.
Uttar pradesh Crime:ఈ సమయంలోనే తనను కేదార్‌నాథ్ తీసుకెళ్లాలని నిషాద్‌ను అతని భార్య సితార కోరింది. రాజా రఘువంశీ ఘటన గుర్తొచ్చి ఆగిపోయానని నిషాద్ చెప్పాడు. ఒకటి, రెండు, మూడు రోజులపాటు ఆ యువతి నిషాద్ ఇంట్లోనే ఉండగా, ఆ మూడు రోజులు తనను ఎక్కడ చంపేస్తుందోనని, నిద్ర కూడా పోలేదని నిషాద్ తెలిపాడు. పెళ్లి అనే మాట వింటేనే దడ పుడుతుందని ఆందోళన వ్యక్తంచేశాడు. ఈ నేపథ్యంలో నాలుగోరోజు అర్ధరాత్రి గోడ దూకి తన ప్రేమికుడితో కలిసి సితార పారిపోయింది.

