US Intelligence Report: చైనా దేశం తన సైనిక సామర్థ్యాన్ని విస్తరిస్తూ ఉన్నది. పాకిస్థాన్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తున్నది. ఈ రెండు దేశాలు వ్యూహాత్మకంగా భారత దేశ భద్రతకు తీవ్రమైన సవాళ్లను విసురుతున్నాయి.. ఈ విషయాలను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) ఇంటెలిజెన్స్ నివేదిక-2025 వరల్డ థ్రెట్ అసెస్‌మెంట్ వెల్లడించింది.
US Intelligence Report: 2025 వరల్డ థ్రెట్ అసెస్‌మెంట్ అనే పేరుతో ఇటీవల విడుదలైన యూఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక ఇండియాకు షాకింగ్ న్యూస్‌ను వెల్లడించింది. చైనా, పాకిస్థాన్ నుంచే ఇండియాకు ముప్పు పొంచి ఉన్నదని ఆ నివేదికలో తేటతెల్లం చేసింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాక్‌పై భారత్ దూకుడుగా వ్యవహరించింది. ఆపరేషన్ సిందూర్ పేరిట ఆ దేశంలోని ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టి పాక్‌కు హెచ్చరికలను జారీ చేసింది. చిన్నా చితకా సరిహద్దు దాడులను భారత్ సైన్యం తిప్పికొట్టగలిగింది.
US Intelligence Report: ఈ నేపథ్యంలో భారత్ రక్షణ వైఖరి ప్రపంచానికి చాటిచెప్పినట్టయింది. చైనాను భారత్ వ్యూహాత్మక ప్రత్యర్థిగా చూస్తుండగా, పాకిస్థాన్‌ను నిరంతర శత్రువుగా చూస్తున్నదని 2025 వరల్డ థ్రెట్ అసెస్‌మెంట్ యూఎస్ పేర్కొన్నది. అయితే ఆ రెండు దేశాలు మిత్రత్వంతో వ్యవహరిస్తున్నాయని, మున్ముందు భారత్‌కు ఆ రెండు దేశాల నుంచి భద్రతా ముప్పు పొంచి ఉన్నదని మాత్రం యూఎస్ హెచ్చరికలు జారీ చేసింది.