UPSC Exam: దివ్యాంగ(పీడబ్ల్యూబీడీ) అభ్యర్థులు ఏవైనా ఉద్యోగ పరీక్షలు రాయాలంటే అవస్థలు పడుతూ ఉంటారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లాలన్నా ప్రయాణ దూరభారంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కేంద్రాల్లోకి వెళ్లాలన్నా, తమకు కేటాయించిన గదులకు చేరుకోవాలన్నా ఇక్కట్లకు గురవుతూ ఉంటారు. మెట్లు ఎక్కాలంటే వారికి అవస్థలు తప్పదు. ఇలాంటి వారికోసం యూపీఎస్సీ తీపి కబురు అందించింది.
UPSC Exam: దివ్యాంగ అభ్యర్థులు కోరుకున్న పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామని యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) భరోసా ఇచ్చింది. ఈ తరహా దివ్యాంగుల కోటా ద్వారా దరఖాస్తు చేసుకునే వారికి ప్రయాణ భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దివ్యాంగ అభ్యర్థులకు వెసులుబాటు కల్పించాలని యూపీఎస్సీ భావించింది.
UPSC Exam: యూపీఎస్సీ తాజా నిర్ణయం ప్రకారం దివ్యాంగులైన అభ్యర్థులు, దివ్యాంగేతర అభ్యర్థులు తాము కోరుకున్న కేంద్రంలో మొత్తం సామర్థ్యం (అభ్యర్థుల సంఖ్య) నిండే వరకు అనుమతి ఇస్తారు. ఆ తర్వాత కూడా అదే పరీక్ష కేంద్రం కావాలని పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కోరితే వారందరి కోసం ఆ కేంద్రం సామర్థ్యాన్ని విస్తరిస్తారు. దీంతో దివ్యాంగ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు.
