UPSC Job 2026 Calendar

UPSC Job 2026 Calendar: యూపీఎస్సీ జాబ్ క్యాలండర్‌ వచ్చేసింది.. ఫుల్ షెడ్యూల్ ఇదే

UPSC Job 2026 Calendar: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రతి సంవత్సరం అనేక పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది. UPSC ఇటీవల తన అధికారిక వెబ్‌సైట్‌లో 2025-26 సంవత్సరానికి కొత్త పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ క్యాలెండర్‌లో వివిధ పరీక్షల తేదీలు, నోటిఫికేషన్ విడుదల తేదీలు, దరఖాస్తుల గడువులు వంటి కీలక సమాచారం పొందుపర్చారు.

ముఖ్యమైన పరీక్షల తేదీలు ఇలా ఉన్నాయి:

 సివిల్ సర్వీసెస్ (CSE) 2026

  • ప్రిలిమినరీ పరీక్ష: 2026 మే 24

  • మెయిన్స్ పరీక్ష: 2026 ఆగస్టు 21

  • నోటిఫికేషన్ విడుదల: 2026 జనవరి 14

  • దరఖాస్తులకు చివరితేదీ: 2026 ఫిబ్రవరి 3

ఎన్డీఏ/ఎన్‌ఏ, సీడీఎస్ (NDA/NA, CDS 1) 2026

  • ప్రవేశ పరీక్ష తేదీ: 2026 ఏప్రిల్ 12

ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష (IES) 2026

  • నోటిఫికేషన్ విడుదల: 2026 ఫిబ్రవరి 11

  • దరఖాస్తులకు గడువు: 2026 మార్చి 3

  • రాత పరీక్ష తేదీ: 2026 జూన్ 9

సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) 2026

  • నోటిఫికేషన్ విడుదల: 2026 ఫిబ్రవరి 18

  • దరఖాస్తులకు గడువు: 2026 మార్చి 10

  • పరీక్ష తేదీ: 2026 జూలై 19

 ముఖ్య గమనిక:

యూపీఎస్సీ ప్రకారం, అప్రत्यాశిత కారణాల వల్ల పరీక్షల షెడ్యూల్, నోటిఫికేషన్ తేదీలు మారే అవకాశం ఉంది. కనుక అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ సందర్శిస్తూ తాజా అప్డేట్స్ తెలుసుకోవాలి.

ఇది కూడా చదవండి: Nara Lokesh: మెగా డీఎస్సీ గ‌డువు పొడిగింపుపై మంత్రి లోకేశ్ కీల‌క వ్యాఖ్య‌లు

అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండి:

2025-26 UPSC పరీక్షల పూర్తి షెడ్యూల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి:

https://www.upsc.gov.in

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *