Dead Body In Parcel

Dead Body In Parcel: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన

Dead Body In Parcel: ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ..ఒక పార్సెల్ అయితే ఆమెకు వచ్చింది. ఎవరు పంపించారు..నాకెందుకు ఇంత పెద్ద పార్సెల్ పంపారు అని …అసలు ఏముందో ఇందులో అని ఓపెన్ చేసింది. దెబ్బకు గుండె దభేల్ మని కొట్టుకుంది. అమ్మ బాబోయ్ అంటూ పోలీసులకు ఫోన్ చేసి …వియూషయం చెప్పింది. పరుగు పరుగున అక్కడికి వచ్చిన పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఇంతకీ ఆమెకు ఎందుకు ఈ పార్సెల్ పంపారు

పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళకు పార్సిల్‌లో డెడ్ బాడి రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగంటి గ్రామంలోని ఒక మహిళకు పార్శిల్‌లో మృతదేహం వచ్చింది. దానిలో ఓ బెదిరింపు లేఖ ఉంది. ఈ ఘటన ఆమెతో పాటు స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. జిల్లా ఎస్పీ నయూం అస్మి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Dead Body In Parcel: గ్రామానికి చెందిన సాగి తులసి అనే మహిళకు జగనన్న కాలనీలో స్థలం మంజూరు కాగా ఇల్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం ఆ ఇల్లు ప్లాస్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఈ క్రమంలో ఇంటి నిర్మాణానికి ఆర్ధిక సాయం కోసం క్షత్రియ సేవా సమితిని ఆశ్రయించింది. ఆమెకు సదరు సేవా సమితి మొదటి విడతలో టైల్స్ పంపించింది. మరోసారి ఆర్ధిక సాయం కోసం మహిళ దరఖాస్తు చేసుకోగా, పార్శిల్‌లో విద్యుత్ సామగ్రి వస్తుందని భావించింది.

అయితే, తాజాగా వచ్చిన పార్శిల్‌లో విద్యుత్ సామాగ్రికి బదులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం వచ్చింది. పార్శిల్‌లో ఒక ఉత్తరం కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలి. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొని ఉంది. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Dead Body In Parcel: పోలీసులు గ్రామానికి చేరుకుని పరిశీలించారు. పార్శిల్ పెట్టెలో సుమారు 45 సంవత్సరాల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం సగ భాగం ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *