Airtel: ఉపాధ్యాయుల కోసం ఎయిర్‌టెల్ ‘ది టీచర్స్ యాప్’ పేరుతో ప్రత్యేక యాప్‌ను విడుదల చేసింది. ‘మొబైల్ ఫోన్’ ద్వారా ఉపయోగించగలిగే ఈ యాప్, ఉపాధ్యాయులకు బోధనాశాస్త్రంతో సహా, భవిష్యత్తు నైపుణ్యాలను గుర్తించడంతోపాటు అవసరమైన కంటెంట్‌ను అందిస్తుంది.
ఈ యాప్‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన యువ తరం వారి మనస్సులలో స్పష్టమైన ఆలోచన కలిగి ఉండాలి. ఇది భావి ఉపాధ్యాయుల ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుంది అని చెప్పారు.
ఇది కూడా చదవండి: Supreme Court: రాజ్యాంగ పీఠిక నుంచి ఆ పదాల తొలగించడంపై నో చెప్పిన సుప్రీం
Airtel: కొత్త ఆర్థిక వ్యవస్థలో పాలుపంచుకోవడానికి మాత్రమే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నూతన ఆవిష్కరణలకు మన యువతను సిద్ధం చేయడం అతిపెద్ద సవాలని మంత్రి అన్నారు.
గ్రామాలను సందర్శించినప్పుడు నాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అక్కడి పిల్లల చదువు పట్ల మక్కువ, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలు నన్ను ఆశ్చర్యపరుస్తాయి. ఉపాధ్యాయులు ఇప్పటి విద్యార్థుల వేగాన్ని అందుకోగలరా అనే భయం ఎప్పుడూ ఉంటుంది. అందుకే, ఉపాధ్యాయులలో బోధించే సామర్థ్యాన్ని పెంపొందించుకునే ప్రతిభను పెంచుకోవాలి. అందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.