woman rescued from train accident at udipi railway station

రైలు కిందపడిన యువతి.. ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్ చేసిన పనికి అంతా ఫిదా 

అదృష్టమంటే ఆమెదే. అతి పెద్ద ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలు కాపాడుకుంది. కాదు.. ఆమె ప్రాణాలు కాపాడింది ఒక ఆర్బీఎఫ్ కానిస్టేబుల్. రైలు కింద పడబోయిన మహిళా ప్రయాణికురాలిని ఓ ఆర్ఫీఎఫ్ కానిస్టేబుల్  కాపాడిన సంఘటన ఉడిపి రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకుంది. ఉడిపి రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది.

మంగళూరు మడ్గావ్ ప్యాసింజర్ రైలు స్టేషన్‌లో రైలు వేగంగా కదులుతుండగా ఓ మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి రైలు ఎక్కేందుకు ప్రయత్నించింది. ఈ సందర్భంలో, పట్టుజారి ఆ మహిళ పకిందికి పడిపోయింది. ట్రైన్ కు ప్లాట్ ఫామ్ కు మధ్యలో ఆమె పడిపోయింది. అక్కడే ఉన్న  ఒక రైల్వే పోలీస్ కానిస్టేబుల్ ఈ సంఘటన గమనించింది. సెకన్లలో స్పందించింది. వేగంగా తన ప్రాణాలను లెక్కచేయకుండా.. ఆ మహిళను కాపాడటానికి ప్రయత్నాలు చేసింది.  ఆ మహిళా కానిస్టేబుల్ వేగవంతంగా స్పందించక పోతే కనుక ఆ మహిళ ప్రాణాలకు ముప్పు వచ్చేది. ఆర్‌పిఎఫ్ సిబ్బంది త్యాగానికి రైల్వే శాఖ సిబ్బంది, ప్రయాణికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వీడియో మీరూ చూసేయండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *