Uddhav Thackeray: మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షమైన శివసేన – యుబిటి చీఫ్ ఉద్ధవ్ థాకరే మంగళవారం వినాయక్ సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీర్ సావర్కర్‌కు బీజేపీ భారతరత్న ఎప్పుడు ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. దేవేంద్ర ఫడ్నవీస్ 2019లో దీనికి సంబంధించి లేఖలు కూడా రాశారు. అప్పుడు కూడా మోదీ ప్రధానిగా ఉన్నారని ఆయన అన్నారు. నాగ్‌పూర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతకుముందు డిసెంబర్ 14న ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ కూడా సావర్కర్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎప్పుడూ సావర్కర్‌కు వ్యతిరేకం. కొన్ని సంవత్సరాల క్రితం, మహారాష్ట్ర కాంగ్రెస్ మాసపత్రిక ‘షిడోరి’ అతని గురించి ‘మాఫీవీర్’ అని రాసింది.
అదేవిధంగా ఉద్ధవ్ కొత్తగా ఎన్నికైన ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది EVM ప్రభుత్వం. EVM ప్రభుత్వానికి ఆల్ ది బెస్ట్ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇది వారి మొదటి సెషన్. సభలో మంత్రులను సీఎం ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈడీ కేసులు పెండింగ్‌లో ఉన్న మంత్రులను సీఎం ప్రవేశపెట్టాల్సి వచ్చింది అంటూ ఆయన విమర్సించారు.
ఇది కూడా చదవండి: Narendra Modi: కాంగ్రెస్ జలవివాదాలను ప్రోత్సహిస్తూ వచ్చింది
Uddhav Thackeray: మంత్రివర్గ విస్తరణపై ఉద్ధవ్ మాట్లాడుతూ జాకెట్లు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని ధరించలేని వారి పట్ల నా సానుభూతిని తెలియజేస్తున్నాను. మంత్రులుగా చేయని వారిని చూసి బాధపడ్డాను. ప్రభుత్వంలో ఏదో లోపం ఉంది. నేను భుజబల్‌తో ఇంకా మాట్లాడలేదు కానీ అతను నాతో టచ్‌లో ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చారు.
ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనేది దృష్టిని మళ్లించే ప్రయత్నం అని చెప్పారు ఉద్ధవ్ థాకరే. వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు కంటే ముందు ప్రజల మనస్సులలో సందేహాలు తీర్చడానికి బ్యాలెట్ పేపర్ పై ఎన్నికలు జరిపించండి అని చెప్పారు. ఎన్నికల కమిషనర్‌ను కూడా ప్రజలు ఎన్నుకునేలా చేయండి అని అన్నారు. ఎన్నుకోవాలి.
లడ్కీ బెహన్ స్కీమ్ వెంటనే ప్రారంభించాలి . హామీ ఇచ్చిన ప్రకారం, ఎటువంటి షరతులు లేకుండా మహిళలకు రూ.2100 ఇవ్వాలి అని ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు.


