Two Sisters: ఉత్తరప్రదేశ్ నోయిడాలోని ఓ సొసైటీలో రచ్చ సృష్టించి రిటైర్డ్ డీఎస్పీ ఇంట్లోకి కత్తితో చొరబడి బెదిరించిన ఇద్దరు అక్కచెల్లెళ్ళు భవ్య జైన్ (23), చార్వి జైన్ (21)లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ డీఎస్పీ అశోక్ శర్మ(70) ఫిర్యాదు మేరకు సొసైటీలో అక్కాచెల్లెళ్లిద్దరూ బిగ్గరగా కారు హారన్ మోగిస్తున్నారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇద్దరూ ఇంటి బయట ఉన్న పూల కుండీలను విసిరి పగలగొట్టారు.
విషయం ఇక్కడితో ఆగిపోలేదు. మరుసటి రోజు కత్తితో శర్మ ఇంట్లోకి ఆ ఇద్దరూ ప్రవేశించారు. దీంతో శర్మ పోలీసులకు ఫోన్ చేసి ఘటనపై సమాచారం అందించాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలించారు.
ఇది కూడా చదవండి: Delhi: సిగ్నల్ క్రాస్ చేసి.. పోలీసులను ఢీకొట్టి..కారు బీభత్సం
Two Sisters: శర్మ ఫిర్యాదుతో, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, అక్కాచెల్లెళ్లిద్దరూ పట్టుబడతారేమోననే భయంతో తమ ఫ్లాట్‌కు తాళం వేశారు. పోలీసులు వారిని ఫ్లాట్ నుంచి బయటకు తీసేందుకు గంటల తరబడి ప్రయత్నించినా వారు బయటకు రాలేదు. చాలా సేపటి తరువాత ఇంటిలోంచి బయటకు వచ్చి కారులో కూచుని వేగంగా అక్కడ నుంచి వెళ్ళడానికి ప్రయత్నించారు. ఈ హడావుడిలో పోలీస్ వ్యాన్ తో పాటు.. పలు వాహనాలను ఢీ కొట్టారు. ఈ ఘటనలో రోడ్డుపై పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు కారును వెంబడించి చివరికి నోయిడా సెక్టార్ 20లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను అదుపులోకి తీసుకున్నారు.

