HIT

HIT 3: హిట్ 3 లో మరో ఇద్దరు హీరోలు!

HIT 3: న్యాచురల్ స్టార్ నాని ‘హిట్-3’ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాలో అర్జున్ సర్కార్ అనే పవర్‌ఫుల్ పాత్రలో నాని నటిస్తున్నాడు. తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో నానితో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కనిపిస్తారని తెలుస్తోంది. హిట్ 1 లో నటించిన విశ్వక్ సేన్, హిట్ 2 హీరో అడివి శేష్ ఇప్పుడు హిట్ 3లో కేమియో పాత్రల్లో కనిపిస్తారని సమాచారం. దీంతో హిట్ 3 మూవీలో వారి ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pradeep Machiraju: పాట పాడుకుంటున్న అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *