Crime News: హైదరాబాద్‌లో మరో అపశృతి జరిగింది. బండ్లగూడలో గణేషుడి విగ్రహ రథయాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైటెన్షన్ కరెంట్ వైర్లు తగిలి రోడ్డుపైనే స్పాట్‌లో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్పాట్‌లోనే టోని, వికాస్ అనే యువకులు మృతి చెందారు. గాయపడిన అఖిల్ పరిస్థితి విషమంగా ఉంది. విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. కరెంట్ షాకుతో పూర్తిగా ట్రాక్టర్ టైర్లు కాలిపోయాయి.
ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. పోలీసులు, క్రేన్ సహాయంతో విగ్రహాన్ని అక్కడ నుంచి తొలగించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా రెండు రోజుల క్రితం రామాంతాపూర్ కృష్ణాష్టమి యాత్రలోనూ ప్రమాదం జరిగింది. రామాంతాపూర్ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది స్పృహ కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Bus Accident: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. భయంతో ప్రయాణికులు ఏం చేశారో చూడండి
వీరిలో ఐదుగురు ఘటనా స్థలంలోనే చనిపోగా.. మరో నలుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రామంతాపూర్ ఘటనపై సీఎం రేవంత్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కవిత సహా పలువురు విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోందని
