Tirupathi: తల్లిత్రండ్రి తరువాత గురువువే అనేవారు ఇప్పటికి అలాగే అంటారు. విద్యార్థులని ప్రయోజకులను చేయాలిసిన బాధ్యత తీసుకోవడం వదిలేసి.. లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి తిరుపతి లో జరిగింది. విద్యార్థిపై లైంగిక దాడి కేసులో ఇద్దరు ప్రొఫెసర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం చెప్పిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన యువతీ(27) తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఆమెపైన కన్నేసిన వర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.లక్ష్మణ్ కుమార్ తన జాబ్‌ని అడ్డుపెట్టుకొని ఆమెని ప్రేస్సెర్ చెయ్యడం మొదలు పెట్టాడు. ఎన్ని సార్లు తప్పు అని చెప్పిన ప్రొఫెసర్ వినకుండా ఇంకా తన కోరిక తీర్చాలి అంటూ ప్రెస్సర్ చేయడంతో తప్పక ఒప్పుకుంది. వెంటనే తన కార్యాలయంకి తీసుకోని వెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
అది మొత్తం అదే విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫర్ డా.ఎ.శేఖర్‌రెడ్డి కిటికీ సందులోంచి వీడియోలు ఫోటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడతాం అంటూ శారీరకంగా, మానసికంగా వేధించారు. ఇంకా తట్టుకోలేక వర్సిటీ ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు చేసింది. అనంతరం తిరుపతి పడమర పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన వెంటనే డీఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ టీంని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ మురళి మోహన్ ఆధ్వర్యంలో ఇంకో బృందం బాధితురాలి విలేజ్‌కి వెళ్లి ఆమె వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తో ఇద్దరు ప్రొఫెసర్స్‌ని పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.
