Anchor Swetcha Votarkar: తెలుగు మీడియా రంగంలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ తెలుగు యాంకర్ స్వేచ్ఛ వోటార్కర్(40) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. రాత్రి 10.30 గంటలకు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. గాంధీనగర్ పక్కనే జవహర్ నగర్ లో పెంట్ హౌస్ లో ఉంటున్న స్వేచ్ఛ ఇంట్లో చున్నీ తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె తలిదండ్రులు శ్రీదేవి, తెలంగాణ శంకర్ దగ్గరలో రామ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. స్వేచ్ఛ వయసు 40 ఆమెకు పెళ్లి కాగా ఓ కూతురు కూడా ఉంది. భర్తతో విడాకులు తీసుకున్న ఆమె ప్రస్తుతం ఒంటరిగా ఉంటుంది.
స్వేచ్ఛ యాంకర్ మాత్రమే కాదు మంచి కవయిత్రి కూడా. ఆ మె రచించిన మట్టిపూల గాలి కవితా సంపుటిని రెండేళ్ల క్రితం విడుదల చేసింది. ప్రకృతిని ఎంతో ఇష్టపడే స్వేచ్ఛ అన్యాయాన్ని అంతే సూటిగా ప్రశ్నిస్తుంది. తెలంగాణ ఉద్యమంలో మహిళా పాత్రికేయురాలిగా తన వంతు కీలక పాత్ర పోషించింది. జర్నలిజం అంటే స్వేచ్ఛకు ఎంతో ఇష్టం. ముందుగా ఆమె మహా న్యూస్ లో పనిచేశారు.
ఇది కూడా చదవండి: Kavita: కేంద్ర మంత్రితో భేటీ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
ఆ తరువాత hmtv, అక్కడ నుంచి 12 ఏళ్లు tv9 లో చేసి మంచి యాంకర్ గా, హోస్ట్ గా, ఇంటర్వ్యూయర్ గా, న్యూస్ ప్రజెంటర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్నాళ్ళు మళ్ళీ V6, hm tv లో చేసి గత మూడేళ్లుగా T న్యూస్ లో చేస్తోంది! నమస్తే తెలంగాణ పత్రిక ఎడిట్ పేజీ లో వ్యాసాలు రాస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంది. ఇటీవలే జరిగిన జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హొసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా గెలిచింది. ఆమె మృతి పట్ల పలువురు సినీయర్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.