Tuni: తుని మున్సిపాలిటీలో భారీ అవినీతి చిట్కా బయటపడింది. మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సునీత ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పౌరుల నుండి సేకరించిన పన్నులు, ఇతర ఆదాయాన్ని మున్సిపాలిటీ సిబ్బంది సునీత వద్ద జమ చేస్తుండగా, ఆమె వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయకుండా తప్పుడు లెక్కలు చూపించి దారిమళ్లించినట్లు సమాచారం. ఇప్పటివరకు దాదాపు రూ. 26 లక్షల మేర నిధులు గోల్‌మాల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మున్సిపాలిటీ అధికారులు అనుమానంతో దర్యాప్తు చేపట్టి అక్రమాలు వెలుగులోకి తెచ్చారు. ఘటనపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.