Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమల పేరు వింటేనే భక్తుల మనసులు భక్తిపారవశ్యంతో పులకరిస్తాయి. స్వామివారిని దర్శించుకోవాలని, ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో కాసేపు గడపాలని ప్రతి రోజూ వేలాదిమంది భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. అయితే కేవలం దర్శనం మాత్రమే కాకుండా.. కొండపైకి వచ్చే లక్షలాది మంది భక్తులకు స్వచ్ఛందంగా సేవలు అందించాలని చాలామందికి కోరిక ఉంటుంది.
-
వయోపరిమితి: సేవకుడిగా దరఖాస్తు చేసుకునే మహిళలు, పురుషుల వయస్సు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి.
-
ఆరోగ్య స్థితి: శారీరకంగా, మానసికంగా దృఢంగా, ఆరోగ్యంగా ఉండాలి (ఎందుకంటే క్యూలైన్లలో ఎక్కువసేపు నడవడం, నిలబడటం వంటి విధులు ఉంటాయి).
-
సేవ కాలవ్యవధి: ఈ సేవ వారం రోజుల (7 రోజులు) పాటు ఉంటుంది.
-
మళ్లీ సేవకు గ్యాప్: ఒకసారి వారం రోజుల పాటు సేవ పూర్తయిన తర్వాత, మళ్లీ సేవకు రావాలంటే కనీసం 90 రోజుల విరామం (కూలింగ్ పీరియడ్) ఉండాలి.
-
కోటా విడుదల సమయం: టీటీడీ సాధారణంగా ప్రతి నెలా 26 నుంచి 28వ తేదీల మధ్య రాబోయే నెలకు సంబంధించిన ‘శ్రీవారి సేవ’ స్లాట్ల కోటాను అధికారిక పోర్టల్‌లో విడుదల చేస్తుంది.
ఆన్‌లైన్ బుకింగ్ నుంచి కొండపై రిజిస్ట్రేషన్ వరకు – స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..
-
ఆన్‌లైన్ బుకింగ్:సేవ చేయాలనుకునే భక్తులు ముందుగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్
[https://ttdevasthanams.ap.gov.in/]లోకి వెళ్లి ‘Srivari Seva’ విభాగంలో తమ వివరాలను నమోదు చేసుకుని, నచ్చిన తేదీల స్లాట్‌ను బుక్ చేసుకోవాలి. బుకింగ్ కన్ఫర్మేషన్ ఫారమ్‌ను ప్రింటౌట్ తీసుకోవాలి. -
డాక్యుమెంట్ల వెరిఫికేషన్:తిరుమలకు చేరుకున్న తర్వాత, కేటాయించిన రిపోర్టింగ్ సమయానికి బుకింగ్ ఫారమ్, ఒరిజినల్ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, ఫొటోలతో రిపోర్ట్ చేయాలి. గ్రూప్ సూపర్‌వైజర్లు ఈ పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు (స్క్రూట్నీ చేస్తారు).
-
రిజిస్ట్రేషన్ & కిట్ అందజేత:పరిశీలన పూర్తయ్యాక రిజిస్ట్రేషన్ కౌంటర్‌లో పేరు నమోదు చేస్తారు. అక్కడ ఇచ్చే లాకర్ స్లిప్ తీసుకుని ఎఫ్ఎంఎస్ (FMS) కౌంటర్ వద్దకు వెళ్తే లగేజీ భద్రపరుచుకోవడానికి లాకర్, తాళం చెవి ఇస్తారు.
-
ఐడీ ట్యాగ్, స్కార్ఫ్:రిసెప్షన్ కౌంటర్‌లో ప్రతి సేవకుడికి గుర్తింపు పౌచ్, ఐడీ ట్యాగ్ మరియు అధికారిక ‘శ్రీవారి సేవ’ స్కార్ఫ్ అందజేస్తారు.
సత్సంగం & ఓరియంటేషన్ క్లాసులు..
-
క్యూలైన్లలో ప్రసాద వితరణ: వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, కృష్ణతేజ గెస్ట్ హౌస్, శిలాతోరణం, బాట గంగమ్మ ఆలయం సమీపంలోని క్యూలైన్లలో నిరీక్షిస్తున్న భక్తులకు మంచి నీరు, అన్నప్రసాదం, పాలు, బిస్కెట్ల పంపిణీ.
-
పరిపాలన & లగేజీ కౌంటర్లు: సెంట్రల్ రిసెప్షన్ ఆఫీస్ (CRO), లగేజీ డిపాజిట్ కేంద్రాలు, కల్యాణకట్ట (తలనీలాలు సమర్పించే చోట మార్గదర్శనం), లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద క్యూ నిర్వహణ.
-
గర్భాలయ సేవ (లక్కీ డిప్): సేవకులకు లక్కీ డిప్ లేదా రాండమ్ కంప్యూటర్ పద్ధతిలో ఆలయం లోపల శ్రీవారి సన్నిధిలో ప్రత్యక్షంగా సేవలందించే అరుదైన అదృష్టం కూడా దక్కవచ్చు.
-
ఫీడ్‌బ్యాక్ సేకరణ: తిరుమలలో అన్నప్రసాదం నాణ్యత, పారిశుధ్యంపై నేరుగా భక్తుల నుంచే విలువైన ఫీడ్‌బ్యాక్ తీసుకునే బాధ్యతను కూడా సేవకులకే అప్పగిస్తారు.
సేవకుల కోసం టీటీడీ రూ.120 కోట్లతో నిర్మించిన ప్రత్యేక సదుపాయాలు:
-
శ్రీవారి సేవా సదన్ 1 & 2:సుమారు రూ.120 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ సదన్లలో పురుషులు, మహిళలకు వేర్వేరుగా విశాలమైన, పరిశుభ్రమైన వసతి గదులు, లాకర్లు, భోజన సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తారు.
-
ఉచిత దర్శనం & శ్రీవారి లడ్డూ:వారం రోజుల పాటు నిబద్ధతతో సేవను విజయవంతంగా పూర్తి చేసుకున్న సేవకులకు.. చివరి రోజు టీటీడీ తరఫున ప్రత్యేక ప్రవేశం ద్వారా శ్రీవారి ఉచిత దర్శన భాగ్యంతో పాటు ఒక ఉచిత లడ్డూ ప్రసాదాన్ని బహుమతిగా అందిస్తారు.
Srivari Sevaks from various states across India arrive at Tirumala after registering for Srivari Seva. Group supervisors guide them through the necessary formalities and provide detailed information about accommodation, seva duties, and other facilities to ensure a smooth and comfortable stay during their service.
#TTDevasthanams #TTD #SrivariSevak #Tirumala #Tirupati #TTDofficialupdates
— Tirumala Tirupati Devasthanams (@TTDevasthanams) October 6, 2026
